25.9 C
India
Monday, December 15, 2025
More

    Land Acquisition Act : ‘జగన్’ భూ సమీకరణ చట్టం రాళ్లను తొలగిస్తున్న రైతులు!

    Date:

    Land Acquisition Act
    Land Acquisition Act

    Land Acquisition Act : కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా సవాలక్ష కారణాలు ఉన్నాయి. అందులో ‘భూ సమీకరణ చట్టం’ కూడా ఒకటి. భారీ మెజారిటీతో గెలిచిన చంద్రబాబు నాయుడు భూ సమీకరణ చట్టాన్ని రద్దు చేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యలో కృష్ణా జిల్లాలో కొందరు రైతులు గత వైసీపీ ప్రభుత్వం వేసిన వైఎస్ జగన్ భూ పరిరక్షణ సర్వే గుర్తులను తొలగిస్తున్నారు.

    ఎన్నికలకు నెల ముందు వైసీపీ ప్రభుత్వం డిజిటల్ సర్వే ముసుగులో రైతులను సంప్రదించకుండా మండలంలో నాలుగు వేల ఎకరాలను సర్వే చేసి పొలాల్లో గుర్తులు ఏర్పాటు చేసింది. రైతులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఫోటో ఉన్న ఈ గుర్తులను రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ చర్య గత సరిహద్దులను విస్మరించడం వల్ల రైతుల మధ్య కొత్త ఘర్షణలకు దారి తీసింది. ఉదాహరణకు కుమ్మమూరు గ్రామంలో ఒకే పొలంలో ఒకే చోట మూడు గుర్తులు వేయడం సర్వే ఎంత లోపభూయిష్టంగా ఉందో చెప్పకనే చెప్తోంది.

    మొదట్లో అధికారులు వేసిన గుర్తులను తొలగించేందుకు రైతులు సాహసించలేదు. అయితే టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అయ్యాక భూ కబ్జాలకు సహకరించే చట్టం భూ మీకరణ చట్టంను రద్దు చేస్తూ సంతకం చేయడంతో రైతులకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు అనుకూల ప్రభుత్వం రావడంతో రైతులు సర్వే గుర్తులను తొలగించడం ప్రారంభించారు.

    చంద్రబాబు నాయుడి ప్రభుత్వం రాకుంటే తాము కోట్లాది రూపాయల విలువైన భూమి, మంచి పంట పండించే భూమిని కోల్పోయేవారిమని రైతులు ఆనంద బాష్పాలు కారుస్తున్నరు. వైఎస్ జగన్ ఐదేళ్ల నియంత పాలన నరకం చూపించిందని, ఇప్పుడు ప్రజా పాలన మొదలైందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...

    Jagan : తల్లి, చెల్లిపై మరోసారి కోర్టుకెక్కిన జగన్

    Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ...