21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Rohit-Kohli career : రోహిత్, కోహ్లీ భవితవ్యం ఏమిటి?

    Date:

    Rohit-Kohli career
    Rohit-Kohli career

    Rohit-Kohli career : టీమిండియా రాబోయే రోజుల్లో ఆడే 12 మ్యాచ్ లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యం తేల్చబోతున్నాయా అంటే అంటే అందుకు అవుననే సమాధానం వస్తుంది. ఈ 12 మ్యాచ్ లు వారిద్దరికీ పరీక్షగా మారబోతున్నాయి. రానున్న మ్యాచ్ లలో టీమిండియా ఆట పేలవంగా ఉంటే మాత్రం వారిద్దరి కెరీర్ కు ముగింపు తప్పదని సమాచారం.

    పదేళ్లుగా టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షగానే మారుతున్నది. ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ రోహిత్ సేన ఓటమిపాలవ్వడంతో.. భారత అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. ఈ ట్రోఫీని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని టీమిండియా కసరత్తులు చేస్తున్నది. దీనికి సన్నద్ధమయ్యేందుకు కేవలం 12 మ్యాచ్‌లు మాత్తమే ఉన్నాయి.

    టీమిండియా చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీ సాధించింది. మరోవైపు టీమిండియా చివరిసారిగా 2011లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అయితే మరోసారి స్వదేశంలో వరల్డ్ కప్ ఆడే మరో అవకాశం వచ్చింది. దానికి ఎలాగైనా అందుకోవాలని భావిస్తున్నది. టీమిండియా వచ్చే నెలలో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. దీని తర్వాత రోహిత్ సేన ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీ వన్డే ఫార్మాట్‌లో ఉంటుంది. ఇందులో భారత్ ఫైనల్ చేరితే.. ఇక్కడ ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది.

    గ్రూప్‌ దశలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత భారత్‌ సూపర్‌-4లోకి వెళితే.. ఇక్కడ మూడు జట్లతో మరో మూడు మ్యాచ్‌లు ఆడి ఫైనల్‌కు చేరితే ఒక మ్యాచ్‌. మొత్తం ఆరు మ్యాచ్‌లు.. దీని తర్వాత సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాకు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ టూర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతుంది. దీని తర్వాత భారత్ వరల్డ్‌కప్‌లోకి ఎంటరవుతుంది. దీంతో వెస్టిండీస్ టూర్ నుంచి ఆస్ట్రేలియా సిరీస్ వరకు మొత్తం 12 వన్డేలు ఆడాల్సి వస్తున్నది.

    వన్డే ప్రపంచకప్‌కు సన్నద్ధం అయ్యేందుకు భారత్‌కు ఈ మ్యాచ్‌లు చాలు. బలమైన ఓపెనింగ్ జోడి లేక మిడిలార్డర్‌ను సిద్ధం చేయడమే కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ముందున్న సవాలు. శ్రేయాస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్‌ను చక్కదిద్దుతున్నాడు. అయితే ప్రస్తుతం అతడు ఇంకా కోలుకునే స్టేజిలో ఉన్నాడు. ఆసియా కప్ కల్లా శ్రేయాస్ ఫిట్‌గా ఉంటాడని బీసీసీఐ భావిస్తున్నది.

    అటు రిషబ్ పంత్‌కు ప్రత్యామ్నాయ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్‌ను మేనేజ్‌మెంట్ ఎంపిక చేయాల్సింది. కేఎల్ రాహుల్ ఉన్నా ప్రస్తుతం ఫామ్ లో లేడు. ఈ 12 మ్యాచ్‌లలో సరైన టీమ్ ను ఎంపిక చేయాని రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నారు. అటు వరల్డ్ కప్‌లో ఒకవేళ భారత్ మరోసారి పేలవంగా ఆడితే టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శకం ముగిసినట్లేనని సమాచారం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Border-Gavaskar Trophy : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..

    Border-Gavaskar Trophy : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్...

    Boy Turned Girl : అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ కొడుకు

    Boy Turned Girl : టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్...

    Arshadeep : అర్షదీప్, హర్దిక్ లకు గోల్డెన్ చాన్స్.. ఎలాంటి చాన్స్ వచ్చిందంటే?

    Arshadeep : సౌతాఫ్రికాతో నాలుగు టీ 20 మ్యాచుల క్రికెట్  సిరీస్...

    Team India lowest scores : టీమిండియా మూడు ఫార్మాట్లలో అత్యల్ప స్కోరు ఇవే

    Team India lowest scores : టీమిండియా న్యూజిలాండ్ తో రెండో...