Lohia Kund Waterfall ఏ కుటుంబమైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు సరదాగా గడిపేందుకు ఇష్టపడుతుంటాయి. ఇక ఇటీవల జలపాతాల వద్దకు వెళ్తున్న సందర్శకుల సంఖ్య ఎక్కువవుతున్నది. కానీ చిన్నపాటి నిర్లక్ష్యంతో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా ఇలాగే జలపాతం వద్దకు వెళ్లిన తండ్రికూతుళ్లు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.
మధ్యప్రదేశ్లో ని ఇండోర్ సమీపంలోని లోహియా కుంద్ జలపాతాన్ని చూడడానికి పెద్దసంఖ్యలో సందర్శకులు ఇటీవల వస్తున్నారు. అక్కడ తనివితీరా గడిపి వెళ్తున్నారు. కుటుంబాలతో కలిసి సరదాగా గడుపుతున్నారు. అయితే ఇలాగే ఆదివారం సాయంత్రం ఓ కుటుంబం లోహియా కుంద్ జలపాతానికి వచ్చింది. జలపాతం వద్దకు కారు తెచ్చారు. ఏం జరిగిందో తెలియదు కాని కారు ఒక్కసారిగా జలపాతం వైపు దూసుకొచ్చి అందులోకి జారిపోయింది. అంతా చూస్తుండగానే జలపాతంలోకి పడిపోయింది. చుట్టుపక్కలవారు తండ్రీకుమార్తెలను కాపాడారు. అయితే వారిద్దరూ క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇద్దరినీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.
అయితే సరదాగా గడుదామనుకున్న ఆ కుటుంబం ఒక్కసారిగా ఆందోళనకు లోనైంది. ఏ జరిగిందో తెలియదు కాని కారు ముందుకెళ్ల ఒక్కసారిగా జలపాతంలో పడిపోయింది. అంతా తేరుకునేలోగా ఈఘటన జరిగిపోయింది. స్థానికులు అతి త్వరగా స్పందించడంతో రెండు ప్రాణాలను క్షేమంగా కాపాడగలిగారు. వారు ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. వారి ప్రాణాలు కాపాడిన వారికి దన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కారు జలపాతంలోకి దూసుకెళ్తున్న వీడియో ఒకటి స్థానికుడు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అందరికీ తెలిసిపోయింది.
మధ్యప్రదేశ్ – ఇండోర్ సమీపంలోని లోహియా కుంద్ జలపాతం చూడటానికి వచ్చిన ఒక కుటుంబం కారుని జలపాతం దగ్గర్లో పార్క్ చేసింది. ఐతే హ్యాండ్ బ్రేక్ వెయ్యని కారణంగా ఆ కార్ ఒక్కసారిగా కదిలి జలపాతంలో పడిపోయింది. ఆ కారులో ఉన్న పాపని చుట్టుపక్కల వాళ్ళు కాపాడారు. pic.twitter.com/U98pQ5qB9Z
— Telugu Scribe (@TeluguScribe) August 7, 2023