Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే రంగంలో వారసులు రాణిస్తారు. ఇది రూల్ కాదు.. కానీ వారు పెరిగిన వాతావరణం దృష్ట్యా అటువైపునకే వెళ్లేందుకు ఇష్టపడతారు. ఈ వారసత్వం రాజకీయంలో కొంచెం కొంచెం తగ్గుతున్నా.. సినిమా ఫీల్డ్ లో మాత్రం కొనసాగుతూనే ఉంది. ఒకప్పటి స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వారి వారసులు ఇండస్ట్రీలోకి వస్తే. మళ్లీ వారి వారసులు కూడా సినిమాల్లోనే బిజీ అయ్యారు. ఇది రూల్, వారసత్వం కాదు. ఇక్కడ తండ్రీకొడుకుల కెరీర్ గురించి తెలుసుకుంటే కొంచెం వరకు ఆశ్చర్యం కలుగుతుంది.
ఐఏఎస్ ఆఫీసర్ శ్రుతంజయ నారాయణ్ తండ్రి చిన్ని జయంత్ తమిళ్ ఇండస్ట్రీలో కమెడియన్. ఈయన అసలు పేరు కృష్ణమూర్తి నారాయణ్. ఎన్నో హిట్ సినిమాల్లో హాస్య నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో 80 చిత్రాల వరకు కలిసి నటించాడు. తన తండ్రి స్టార్ కమెడియన్ అయినప్పటికీ, శ్రుతంజయ మాత్రం సినీ ఇండస్ట్రీ వైపునకు వెళ్లకుండా సివిల్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు.
చిన్నతనంలో..
శ్రుతంజయ చెన్నైలో జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే పూర్తయ్యింది. బాల్యంలో నాటకాలంటే ఇష్టం ఉండేది. ఫ్రెండ్స్ తో కలిసి వేస్తుండేవాడు. వీటితో పాటు చదువులో కూడా రాణించాడు. గిండీలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ కార్టోగ్రఫీలో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నాడు. అశోక యూనివర్సిటీ నుంచి లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్/లిబరల్ స్టడీస్‌లో మాస్టర్స్ చదివాడు. చదువు ముగిసిన వెంటనే నటనకు ఫుల్ స్టాప్ పెట్టి ఓ స్టార్టప్ కంపెనీలో చేరాడు. సీరియస్ గా UPSC సివిల్ సర్వీసెస్‌కు ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. ఫుల్ టైం జాబ్ చేస్తూనే 4 నుంచి 5 గంటలు చదివేవాడు.
ప్రిపరేషన్ టైం పొడిగించుకుంటూ వెళ్లాడు. కోచింగ్‌కు వెళ్లకుండానే 10 నుంచి 12 గంటల పాటు ప్రిపేర్ అయ్యేవాడు. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినా సెకండ్ అటెంప్ట్ లో సక్సెస్ అయ్యాడు. 2015 యూపీఎస్సీ(UPSC) సివిల్స్ లో 75వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం తమిళనాడు, త్రిప్పూర్ జిల్లాలో సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్నాడు.
ఓపికతో పాటు పట్టుదల అవసరం
‘ఐఏఎస్ అవ్వడం కఠినమైనది. ప్రిపరేషన్‌కు మానసికంగా సిద్ధం కావాలి. క్లియర్ చేసేందుకు సంవత్సరాలు పట్టచ్చు. అందుకు ఓపిక, పట్టుదల అవసరం. ఎగ్జామ్ పాస్ తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. కొన్ని సార్లు కఠినంగా ఉండవచ్చు. అయినా ఆపకూడదు.’ అని ఐఏఎస్ ప్రియేర్ అయ్యే వారికి శ్రుతంజయ సూచనలు చేశాడు.