FBI arrested : అతడో డాక్టర్. మనుషుల ప్రాణాలు నిలబెట్టే పవిత్రమైన పనిలో ఉన్నాడు. కానీ అతడే విచక్షణ మరిచి ప్రవర్తిస్తే ఇంకేముంది డాక్టర్లను అందరిని అనుమానించాల్సి ఉంటుంది. అలాంటి వైద్యుడే చేయకూడని పని చేశాడు. అది ఎక్కడో కాదు సాక్షాత్తు విమానంలోనే ఓ బాలిక ముందు ఆ పని చేసి సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు. మన భారతీయుల పరువు తీశాడు.
గతేడాది మే నెలలో హవాయి దీవుల్లోని హోనోలులూ నుంచి బోస్టన నగరానికి విమానంలో వెళ్తుండగా ఈ ఘటన చో టుచేసుకుంది. 33 ఏళ్లు భారత సంతతికి చెందిన వ్యక్తి బోస్టన్ లోని టెత్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్ లో వైద్యుడిగా పనిచేస్తుననాడు. ఓ మహిళతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న మెహంతి పక్క సీట్లో బాలిక ఉండగా దుప్పటి మెడ వరకు కప్పుకుని హస్త ప్రయోగం చేశాడు.
ఆ బాలిక తన బామ్మ, తాతయ్యలతో కలిసి బోస్టన్ వెళ్తోంది. పక్క సీట్లో డాక్టర్ మెహంతి దుప్పటికప్పుకున్నప్పటికి కాళ్లు చేతులు పైకి కిందకు కదులుతుండటం చూసి ఆశ్చర్యపోయింది. కాసేపటికి దుప్పటి కింద పడిపోవడంతో అతడి రంగు బయటపడింది. దీంతో హడలిపోయిన బాలిక విషయం బామ్మకు చెప్పింది. వారు అధికారులకు ఫిర్యాదు చేయడంతో డాక్టర్ పై కేసు నమోదైంది.
విమానంలో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు గుర్తించారు. మెమంతిని గురువారం అరెస్టు చేసిన ఎఫ్ బీఐ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో నేరం నిరూపణ అయితే డాక్టర్ కు 90 రోజులు జైలు, ఐదు వేల డాలర్ల జరిమానా, ఏడాది పాటు పోలీసుల పర్యవేక్షణలో సామాజిక జీవనం శిక్ష ఖరారు చేసే అవకాశాలున్నాయి. కేసులో డాక్టర్ మెహంతికి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ లభించడంతో విడుదలయ్యాడు.