ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది అర్జెంటీనా. కొదమ సింహాల్లాంటి రెండు జట్లుఫ్రాన్స్ – అర్జెంటీనా విజేత కోసం తీవ్ర పోరాటం చేసాయి. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఆటలో చివరకు అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా వరల్డ్ కప్ అందుకోవడంతో మెస్సీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
పేరుకు అర్జెంటీనా – ఫ్రాన్స్ ల మధ్య భీకర యుద్ధం అని భావించినప్పటికీ పోటీ మాత్రం మెస్సీ – ఎంబాపే ల మధ్యే జరిగింది. అర్జెంటీనా పాలిట కొరకని కొయ్యగా మారాడు ఎంబాపే. మెస్సీ కి పోటీగా నేనున్నాను అంటూ చుక్కలు చూపించాడు దాంతో మ్యాచ్ అర్జెంటీనా వశం అవుతుందా ? ఫ్రాన్స్ తన్నుకు పోతుందా ? అనే టెన్షన్ నెలకొంది. అయితే అనూహ్యంగా మెస్సీ గోల్స్ చేయడంతో మ్యాచ్ అర్జెంటీనా వశం అయ్యింది. దాంతో 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ వరల్డ్ కప్ అందుకుంది అర్జెంటీనా. ఫిఫా వరల్డ్ కప్ అర్జెంటీనా సొంతం చేసుకోవడంతో ఆదేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఫిఫా వరల్డ్ కప్ విజేత అర్జెంటీనాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.