Bigg Boss 7 Telugu :
బిగ్ బాస్ 7 స్టార్ట్ అయ్యి రెండవ వారం కూడా ముగిసింది.. సెప్టెంబర్ 3న స్టార్ట్ అయిన ఈ సీజన్ ఈసారి మరిన్ని ట్విస్టులతో ఆద్యంతం అలరించేందుకు బిగ్ బాస్ కొత్త కొత్త టాస్కులను ఇస్తున్నాడు. కిరణ్ రాథోడ్, షకీలాను బయటకు పంపించారు.. ప్రస్తుతం 12 మంది హౌస్ లో ఉండగా ఈసారి ౭ మంది నామినేషన్స్ లో ఉన్నారు.
శుభ శ్రీ, దామిని, గౌతమ్, యావర్, ప్రియాంక, రతికా, అమర్ దీప్ లు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. సందీప్, శివాజీ దగ్గర పవర్ అస్త్రా ఉండడంతో ఇంటి సభ్యులుగా అర్హత సాధించుకున్నారు.. ఇక ఈ రోజు శివాజీ, రతిక మధ్య గుసగుసలు స్టార్ట్ అయ్యాయి.. నా గురించే అంతా చెడుగా మాట్లాడు కుంటున్నారు అని ఈమె శివాజీతో అంటుంది.
ముఖ్యంగా నా ఎక్స్ గురించి అంటూ రతికా శివాజీ వద్ద మాట్లాడుతూ అలా మాట్లాడిన వారిని ఏం పీక్కుంటారో పీక్కోమను అంటూ మాట్లాడింది. శివాజీ కూడా స్ట్రాంగ్ గా ఉండాలంటూ సలహా ఇచ్చాడు. అలాగే హౌస్ లో వినాయక చవితి సెలెబ్రేషన్స్ జరిగాయి.. కాగా మూడవ వారంలో కూడా పవర్ అస్త్రా కోసం వేట సాగుతుంది.
మూడవ వారంలో ఈ పవర్ అస్త్రా కోసం అమర్ దీప్, శోభా శెట్టి, యావర్ ను ఎంపిక చేసారు.. ప్రశాంత్ పేరు చెప్పకపోవడంతో అతడు కన్నీరు పెట్టుకున్నారు. ఇక హౌస్ లో రతిక, ప్రశాంత్ మధ్య చిన్న గొడవ స్టార్ట్ అయ్యింది.. ఈ గొడవ హౌస్ లో ఎంటర్టైనింగ్ గా మారింది.. ప్రశాంత్, రతిక ఒకరిపై ఒకరు తిట్ల పురాణం మొదలెట్టి నువ్వు దొబ్బెయ్ అంటే నువ్వు దొబ్బెయ్ అంటూ తిట్టుకున్నారు.
ReplyForward
|