AP cm Jagan : తెలుగు రాషల్లో రాజకీయ, సినిమా రంగాలు పెనవేసుకొనే ఉంటాయి. పలానా హీరో తమకు మద్దతునిస్తే వారి అభిమానుల ఓట్లు తమకే పడుతాయని పార్టీలు అనుకుంటుంటాయి. అయితే గతంలో సినిమారంగం వ్యక్తుల విషయంలో ఏ ప్రభుత్వాలు కూడా దూకుడుగా వ్యవహరించేవి కావు. మంచి సత్సంబంధాలను కొనసాగించేవి. అయితే ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం సినిమా వాళ్లతో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లే కనిపిస్తున్నది. గతంలో సినిమా వాళ్లందరినీ తన కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడిన జగన్, మరోసారి సినిమా నటుల రెమ్యూనరేషన్ విషయంలో కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఇదే ఇప్పుడు సినీ నటుల కోపానికి కారణమైంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ పరోక్షంగా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నది.. ఇక నందమూరి ఫ్యామిలీ ఎలాగూ జగన్ కు దూరంగానే ఉంటుంది. ఇక సినిమా ఇండస్ర్టీలో రెండు పెద్ద ఫ్యామిలీలు ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. తాజాగా మెగాస్టార్ వ్యాఖ్యలు ఈ కోవలోనివే. కొన్ని రోజుల క్రితం హీరో రజినీకాంత్ కూడా పరోక్షంగా జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
ఇక సినిమా వాళ్లంతా ఏపీలో వైసీపీ సర్కారుకు దూరంగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నది. కొంతకాలంగా తటస్థంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంలో స్పందించారు. టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఆయన ఏపీ సర్కారుపై నొచ్చుకున్నట్లు కనిపిస్తున్నది. అయితే ఎన్నికల సమయంలో ఇది వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి లాగే కనిపిస్తున్నది. సినిమా అనే వినోదాన్ని ప్రజల కోణంలో అందించాలని కేవలం సంపాదనే ధ్యేయంగా, అగ్రనటుల రెమ్యూనరేషన్ ఉంటుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి సినీ నటులు ఎదురుతిరిగితే ప్రజలు ఎవరివైపు ఉంటారో వేచి చూడాలి.