25.2 C
India
Tuesday, January 20, 2026
More

    Filmfare : ఫిల్మ్‌ఫేర్‌ ‘సౌత్‌ ఇండియన్‌ అవార్డుల సందడి’.. ఉత్తమ నటిగా సాయి పల్లవి..

    Date:

    Filmfare
    Filmfare Awards

    Filmfare : జాతీయంగా, అంతర్జాతీయంగా ఆశ్చర్యాలను క్రియేట్ చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీ సౌత్ లో సైతం తన సత్తా చాటుకుంది. ఇటీవల ఫిల్మ్ ఫేర్ ‘సౌత్ ఇండియన్ అవార్డులను అందజేశారు. మొత్తం సౌత్ నుంచి ఈ అవార్డులకు ఎంపిక చేయగా.. తెలుగు నుంచే ఎక్కువ మంది ఎన్నికయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ అవార్డులను అందుకోగా.. సాయి పల్లవి సైతం అవార్డును తన ఖాతాలో వేసుకుంది.

    జాతీయ చలనచిత్ర అవార్డుల తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఫిల్మ్‌పేర్‌ సౌత్‌ ఇండియన్‌ అవార్డు’ను గురువారం ప్రకటించింది. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు పొందిన రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం తెలుగు విభాగంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

    ఇక, ఉత్తమ నటులుగా ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, ఉత్తమ డైరెక్టర్ గా రాజమౌళి అవార్డులను అందుకున్నారు. ‘సీతారామం’ హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ ఉత్తమ నటి, ‘విరాటపర్వం’లో నటించిన సాయిపల్లవి క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఉత్తమ సహాయ నటులుగా ‘భీమ్లా నాయక్‌’ నుంచి రానా , ‘విరాటపర్వం’ నుంచి నందితా దాస్‌ ఎంపికయ్యారు. ఉత్తమ గేయ రచయితగా సీతారామ శాస్త్రి (సీతారామం సినిమాకు సంబందించి) ఎన్నికయ్యారు.

    తమిళంలో ఉత్తమ నటుడిగా కమల్‌ హాసన్‌ (విక్రమ్‌ సినిమా) ఉత్తమ నటిగా సాయిపల్లవి, తమిళంలో ఉత్తమ చిత్రంగా పొన్నియిన్‌ సెల్వం-1’ ఎంపికైంది. పొన్నియిన్ సెల్వం డైరెక్టర్ మణిరత్నం ఉత్తమ దర్శకుడిగా ఎన్నికయ్యారు. కన్నడంకు సంబంధించి ‘కాంతార’, మలయాళంకు సంబంధించి ‘న్నా థాన్‌ కేసు కుడు’ ఉత్తమ చిత్రాలుగా ఎన్నికయ్యాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sai Pallavi : బలగం’ వేణుతో సాయిపల్లవి మూవీ?

    Sai Pallavi : స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ‘బలగం’ మూవీ ఫేమ్...

    Amaran movie : శివకార్తికేయన్ మూవీకి కమల్ హసన్ ప్రొడ్యూసర్ గా .. అమరన్ మూవీ కథ గురించి తెలుసా?

    Amaran movie : దీపావళి కానుకగా అమరన్ మూవీని తమిళ్, తెలుగులో...

    Sai Pallavi : నా తల్లిదండ్రులు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

    Sai Pallavi :  ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక రూమర్స్ వస్తూ ఉంటాయి...