36.9 C
India
Tuesday, April 21, 2026
More

    Pawan Career లో ఆగిపోయిన సినిమాలు ఇవే..!

    Date:

    pawan movies
    pawan movies
    Pawan Career : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎవ్వరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.. ఈయన సినిమా వస్తుంది అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ హడావిడి అంతా ఇంతా కాదు.. మరి పవర్ స్టార్ ఇన్నేళ్ల కెరీర్ లో ప్రకటించి, సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత ఆగిపోయిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
    సత్యాగ్రహి : పవర్ స్టార్ జానీ తర్వాత ఈ సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకున్నాడు.. ఏఎం రత్నం నిర్మాతగా అట్టహాసంగానే స్టార్ట్ అయిన ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది.

    satyagrahi

    చెప్పాలని ఉంది : ఈ సినిమా కూడా పవన్ చేయాల్సి ఉంది..అమీషా పటేల్ జంటగా ఈ సినిమాను ప్లాన్ చేసారు.. కానీ అదే సినిమాను చివరికి నువ్వే కావాలి పేరుతో చేయడంతో పవన్ సినిమా ఆగిపోయింది..
    దేశి : దేశభక్తి నేపథ్యంలో సొంతంగా కథ రాసుకుని పవన్ కళ్యాణ్ చేయాలనుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది..
    లారెన్స్ : పవన్-లారెన్స్ కాంబోలో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నాడు..ప్రకటించాడు కూడా.. కానీ ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు..
    సింగీతం శ్రీనివాసరావు : ఏసు క్రీస్తు జీవితంపై పవన్ కళ్యాణ్ హీరోగా సింగీతం శ్రీనివాసరావు తో సినిమా ప్లాన్ చేయగా ఈ మూవీ మధ్యలోనే ఆగిపోయింది..
    మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబోలో కూడా ఒక సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది.. కానీ ఈ సినిమా ఆదిలోనే ఆగిపోయింది..
    Pawan Career kobali
    Pawan Career
    కోబలి : త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబోలో రాయలసీమ నేపథ్యంలో ‘కోబలి’ సినిమా రావాల్సి ఉండగా మధ్యలోనే ఆగిపోవడంతో ఇదే కథతో ఎన్టీఆర్ తో అరవింద సమేత త్రివిక్రమ్ సినిమాను చేసాడు..
    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : ఈ సినిమా పవన్, వెంకటేష్ చేయాల్సి ఉంది.. కానీ పవన్ అనుకోకుండా తప్పుకోవడం వల్ల పవన్ ప్లేస్ లో మహేష్ బాబు చేసాడు..
    సంపత్ నంది : గబ్బర్ సింగ్ 2 సినిమాకు సంపత్ నంది తోనే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది.. అయితే ఈ సినిమా అనుకోకుండా ఆగిపోవడంతో సర్దార్ గబ్బర్ సింగ్ ను బాబీ దర్శకత్వంలో చేసాడు..
    ఖుషీ 2 : ఈ సినిమా సీక్వెల్ ను చాలా ఏళ్లుగా చేయాలని అనుకున్నారు.. కానీ ఇప్పటికి సెట్స్ మీదకు వెళ్లనే లేదు..ముందు ముందు కూడా వెళుతుంది అని నమ్మకం లేదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related