
Viral Video: ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాలు కాలిపోవడం, పేలిపోవడం చాలా వరకు చూశాం. కానీ చేతితో క్యారీ చేస్తున్న బ్యాటరీ కూడా పేలిపోయి.. ఓ వ్యక్తి సెకన్లలో చనిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి వేసవిలో ఇలాంటి పేలుళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. నిజానికి ఇది పాత వీడియో. అయితే ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీని పట్టుకున్న వ్యక్తి లిఫ్ట్‌లోకి ఎక్కడంతో బ్యాటరీ పేలిపోయింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం లేకపోలేదు. అప్పటికే లిఫ్ట్ డోర్ మూసి ఉండడంతో మంటల్లో చిక్కుకున్నాడు.
పెద్ద శబ్ధం రావడంతో బయట ఉన్న వారికి ఈ విషయం తెలిసింది. వెంటనే సెక్యూరిటీకి సమాచారం అందించారు. సెక్యూరిటీ వచ్చి లిఫ్ట్ డోర్లు తెరిచి అతడిని బయటకు తీసుకెళ్ళే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంటలను ఆర్పి బయటకు తీసుకొచ్చే సరికి ప్రాణాలు కోల్పోయాడు. అతని శరీరం పూర్తిగా కాలిపోయింది. అసలు ఈ ఘటన 2021లో జరిగింది.. అయితే ఇప్పుడు ఈ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. అయితే లిఫ్ట్‌లో తీసుకెళ్తే ఎలక్ట్రిక్ బ్యాటరీలు పేలిపోతాయా? అనే ప్రశ్న ఇప్పుడు ఈ వీడియో చూసిన వారికి వస్తుంది. అయితే అది నిజం కాదు. లిఫ్ట్‌లో బ్యాటరీలను తీసుకెళ్లడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే అప్పటికే బ్యాటరీ విడిభాగాలు దెబ్బతిన్నాయని నిపుణులు చెబుతున్నారు.
మరి ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? దీనికి కొన్ని కారణాలు ఉండవచ్చు. బ్యాటరీ ఎలక్ట్రానిక్స్‌లో ఏదైనా దెబ్బతిని ఉండవచ్చు. లేదా లిఫ్ట్‌లో ఏదైనా సాంకేతిక లోపంతో మంటలు చెలరేగి ఉండవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఈ-బైక్ బ్యాటరీలను తీసుకొని వెళ్లేటప్పుడు మ్యాన్‌ఫ్యాక్చర్ గైడ్‌లైన్స్‌ను తప్పకుండా పాటించాలి. బ్యాటరీలో ఏదైనా లోపం ఉందనిపించినప్పుడు వెంటనే సంబంధిత టెక్నిషియన్‌కు చూపించాలి.