41.2 C
India
Friday, April 19, 2024
More

    Financial crisis : ఆర్థిక దివాళాతో ఏపీ విలవిల.. సీఎం జగనే కారణమా..?

    Date:

    Financial crisis
    Financial crisis, CM Jagan

    Financial crisis : ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్నది. అప్పులు తెచ్చుకోవడంలో ఏపీ సీఎం జగన్ ను మించిన నాయకుడే దేశంలో లేడని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. సుపరిపాలన అందిస్తానని ప్రజలకు నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్ తనకు అడ్డు ఎవరూ లేరన్నంతగా రెచ్చిపోతున్నారు. ఏపీని ఆర్థికంగా దివాలా స్థితికి తీసుకొచ్చారు.

    అయితే రాష్ట్రాలకు నిధులను న్యాయబద్ధంగా వాడుకోవాలని తాజాగా జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు. ఏపీకి రుణాల గుదిబండ భారంగా మారింది. భావితరాలు ఇబ్బంది పడతాయని సోయి లేకుండా, ఏపీ భవిష్యత్తుతో జగన్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని అభిప్రాయం ఆర్థికంగా నిపుణుల నుంచి వినిపిస్తున్నది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం బకాయిల భారం మార్చి నాటికి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు దాటింది.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రెండు నెలల్లోనే ఏపీ ప్రభుత్వం 13,500 కోట్ల మేర రుణాలు సేకరించినట్లు సమాచారం. బడ్జెట్లో చూపించకుండానే పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి రెవెన్యూ ఖర్చుకు పెడుతున్నారని గతంలోనే కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. రుణ సేకరణలో నిబంధనలు పట్టించుకోవడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా అవేమీ జగన్ సర్కార్ కు పట్టడం లేదు. సంపద సృష్టిని పక్కన పెట్టేశారు.

    ఉత్తరాంధ్ర రాయలసీమను అభివృద్ధిలో టాప్ లో నిలుపుతామని చెప్పిన వైకాపా, ఆ నిర్ణయాన్ని పక్కకు పెట్టినట్లే కనిపిస్తున్నది. పరిశ్రమలను ప్రోత్సహించడం ఉపాధికి ఊతం ఇవ్వడం లాంటి విషయాల్లో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. కేవలం మాటలకే పరిమితమై మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని అపవాదు మూట గట్టుకున్నది.

    పెట్టుబడులు ఆకర్షించడంలోనూ విఫలం..
    మరోవైపు పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ అంశంలో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ కంటే కూడా వెనకబడిపోయింది. రవాణా సౌకర్యాలు, అభివృద్ధి అంశాల్లోనూ ఏపీ ప్రభుత్వం అట్టడుగు స్థాయిలో నిలిచిపోయింది. భారత నవకల్పనా సూచీలో పొరుగు రాష్ట్రం తెలంగాణ రెండోదిగా నిలిస్తే, ఏపీ 9వ స్థానానికే పరిమితమైంది. కొత్త సంస్థలకు ప్రోత్సాహాన్ని అందించడంలో ఏపీ ఏకంగా 29వ స్థానం దక్కించుకుంది.
    అభివృద్ధిని పట్టకుండా ప్రజలకు జవాబుదారీగా నిలవకుండా ఏపీ ప్రభుత్వం పాలననందిస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పులను ఏ రూపాల్లో తెచ్చారనే అంశాన్ని ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం బయటకు వెల్లడించడం లేదు. సామాన్యుల బతుకులను బలిపీఠంపైకి ఎక్కించే ప్రయత్నంలో జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఇదే ప్రస్తుతం ఏపీ దివాళాకు కారణమవుతున్నదనే అభిప్రాయం వినిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Nidhi Agarwal : ఈ అందాల నిధిని ఆదుకోవాల్సింది ప్రభాసే

    Nidhi Agarwal : సినిమాల్లో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతోందో...

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో.. ఒక్కసారే మహిళా ఎంపీ

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు...

    Actress Kasthuri : అలాంటి పనులు చేయందే సినిమాల్లో ఆఫర్లు రావు.. నటి కస్తూరి

    Actress Kasthuri : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్  గురించి...

    Actress Dedication : గర్భవతిగా ఉండి షూటింగ్ పాల్గొంటున్న నటి ఎవరో తెలుసా..

    Actress Dedication : సినిమాల్లో చాలా మంది హిరో హిరోయిన్లు ఎంతో డెడికేషన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : సిఎం జగన్ పై దాడి కేసులో అప్ డేట్

    - నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు CM Jagan : సిఎం జగన్...

    Jagan Dramas : జగన్ డ్రామాలకు ఎండ్ కార్డు వేస్తామంటున్న నేతలు!  

    Jagan Dramas : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన...

    Yarlagadda-YCP : వైసీపీలో చేరిన తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ యార్లగడ్డ!

    Yarlagadda-YCP : ఎన్నికల వేళ పార్టీల్లోకి రాజకీయ నేతల వలసలు పెరుగుతున్నాయి....

    CM Jagan : కలకలం రేపిన జగన్ పై దాడి

    CM Jagan : సిఎం జగన్ పై నిన్న జరిగిన రాయి...