
First half : ఈ మధ్య రిలీజ్ అయిన కొన్ని సినిమాలు నిర్మాతలను ఘోరంగా దెబ్బకొట్టాయి. కలెక్షన్ కింగ్ లుగా పేరున్న హీరోలు కూడా డిజాస్టర్స్ చూడాల్సి వచ్చింది. ఎంత పెద్ద హీరో అయినా కంటెంట్ బాగా లేకుంటే ఏమీ చేయలేరు కదా.? సినిమాకు సంబంధించి కథనే హీరో. అది వర్కవుట్ కాకుంటే ఎంత పెద్ద స్టార్ అయినా డిజాస్టర్ ఎదుర్కోక తప్పదు. ఇక 2023 టాలీవుడ్ కు ఒక పెద్ద గుణపాఠం అనే చెప్పాలి.
వేసవి సెలవులు సమీపిస్తుండడంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఈ ఏడాది అతి భారీ సినిమాలను రిలీజ్ చేశారు మేకర్స్. బాక్సాఫీస్ కలెక్షన్ల మాట పక్కకుపెట్టు. కనీసం పెట్టిన పెట్టుబడి వస్తే చాలనుకునే నిర్మాతలకు ఈ సినిమాలు భారీగా నష్టాలు తెచ్చిపెట్టాయి. ఈ ఏడాదిలో అత్యంత నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాల గురించి ఇక్కడ చెప్పుకుందాం.
శాకుంతలం దెబ్బ
అత్యంత భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కింది. దిల్ రాజు ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దిల్ రాజు బ్యానర్ కు ఏకంగా రూ. 50 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. గుణశేఖర్ అంచనాలను ప్రేక్షకులు అందిపుచ్చుకోలేక పోయారు. చారిత్రక పురాణం నేపథ్యం కలిగిన కథే అయినా ప్రేక్షకులు ఆదరించలేకపోయారు.
ఏజెంట్, కస్టడీ
అఖిల్ అక్కినేని-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఏజెంట్ మూవీ సక్సెస్ అవుతుందని ఇండస్ట్రీ ఎంతో ఆశగా ఎదురుచూసింది. కానీ ఆ సినిమా ఏకంగా రూ. 33 కోట్లకి పైగానే నష్టం తెచ్చింది. ఇక అఖిల్ అన్న నాగ చైతన్య తీసిన ‘కస్టడీ’’ కూడా ఎవరేజ్ టాక్ తెచ్చుకొని కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీతో నిర్మాత రూ. 18 కోట్లు నష్టపోయాడు. అక్కినేనికి ఈ ఏడాది కలిసి రాలేదు.
రామబాణం
వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న గోపీచంద్ ‘రామబాణం’తోనైనా హిట్ కొట్టాలి అనుకున్నాడు. అయితే ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది. అయితే ఇది కూడా మరో డిజాస్టర్ నమోదు చేసుకుంది. ఈ చిత్రంతో నిర్మాతకు రూ. 16 కోట్ల నష్టం వచ్చింది. బెస్ట్ కాంబోగా శ్రీవాస్, గోపీచంద్ ఇంతకుముందు సక్సెస్ అందుకోగా ‘రామబాణం’ కోలుకోలేని దెబ్బ కొట్టింది.
రావణాసుర
మాస్ మహరాజ్ రవితేజ-డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘రావణాసుర’. ఈ మూవీ ఊహించని టాక్ నైతే తెచ్చుకుంది కానీ, రవితేజ నుంచి ఫ్యాన్స్ కోరుకునే ఎంటర్ టైన్ మెంట్ ను మాత్రం మిస్ చేసింది. స్క్రీన్‌ప్లేలో లోపాల కారణంగా మూవీ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రం నిర్మాతకు రూ. 11 కోట్ల నష్టం తెచ్చిపెట్టింది.
ఇక ఈ సినిమాల్లో ‘రామబాణం’, ‘ఏజెంట్’ మూవీలకు డిజిటల్ హక్కులు కూడా పెద్దగా బిజినెస్ కాలేదు. మొత్తానికి ఈ సమ్మర్ సీజన్ మాత్రం నిర్మాతలను దారుణంగా దెబ్బ తెసిందనే చెప్పవచ్చు.






