
Dr. Jai Yalamanchili : ఏపీలో అయిదు కోట్ల మంది ఆదరించారు.. కాబట్టే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని.. భారీ విజయం అందించినా ప్రజలకు డాక్టర్ జై యలమంచిలి అభినందనలు తెలిపారు. సంపద క్రియేట్ చేసి చూపిస్తాం.. హైదరాబాద్ ను ఎలా డెవలప్ మెంట్ చేశారో.. అందరం చూశాం.. అదే స్థాయిలో టీడీపీ అధినేత కూటమి నేతల సహకారంలో డెవలఫ్ మెంట్ చేసి చూపిస్తామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని రోజులు డెవలఫ్ మెంట్ గురించి ఎవరూ ఆలోచించలేరు. అయితే డెవలఫ్ మెంట్ విషయాన్ని మరిచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. వారందరిని కూడా సరైన సమయంలో సరైన విధంగా చంద్రబాబు చూసుకుంటారని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని డాక్టర్ జై యలమంచిలి అన్నారు. ప్రస్తుతం టీడీపీ కి తోడు జనసేన ఉందని.. పవన్ కల్యాణ్ కూడా సపోర్టు చేస్తుండటంతో అభివృద్ధికి ఢోకా ఉండదని చెప్పాడు.
డాక్టర్ జై యలిమించిలి ఇచ్చిన స్పీచ్ కు అందరూ చప్పట్లతో స్వాగతించారు. టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మిస్తుందని.. అంతటి మహాత్తర నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. హైదరాబాద్ కు శంషాబాద్ ఎయిర్ పోర్టును తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. హైటెక్ సిటీగా మార్చి ఎంతో మంది యువకులకు ఉపాధి కల్పించడంలో చంద్రబాబు ఎంతో ముందు చూపు కలిగిన నేత అని ప్రశంసించారు.
సైకో పాలన పోయి.. ప్రజా ప్రభుత్వ పాలన వచ్చిందని ఇక చంద్రబాబు నాయుడు డెవలప్ మెంట్ మీద దృష్టి పెట్టి విజయం సాధిస్తారని ఎంతో నమ్మకంతో ప్రజలు ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ స్థాయిలో అమరావతి రాజధానిగా డెవలఫ్ అయి తీరుతుందని చెప్పారు. డాక్టర్ యలమంచిలి ఎన్ ఆర్ఐల సమావేశంలో రక్తదానం గురించి దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. తెలుగు దేశం పార్టీ చేసే అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.