30.1 C
India
Sunday, April 19, 2026
More

    ఎట్టకేలకు MH370 విమానం జాడ చిక్కింది..!

    Date:

    Plane
    Plane
    ఎట్టకేలకు MH370 విమానం జాడ చిక్కింది. సముద్ర గర్భంలో ఉందని తెలిసింది. 239 మంది అస్తిపంజరాలు విమానంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
    మలేషియాకు చెందిన అంతర్జాతీయ పౌర విమానం MH370 జాడ తొమ్మిది సంవత్సరాల తర్వాత బయటపడింది. 8 మార్చి, 2014న మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకునేందుకు మలేషియా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం MH370 బయల్దేరింది. టేకాఫ్ అయిన 38 నిమిషాలకు దక్షిణ చైనా సముద్రం మీదుగా విమానంకు, ఎయిర్ కంట్రోల్ కు మధ్య సంబంధాలు తెగిపోయాయి. తర్వాత రాడార్ తో ఎంత ప్రయత్నించినా విమానంతో సంబంధాలు కలువలేదు. అయితే ఈ ఫ్లయిట్ లో 14 దేశాలకు చెందిన మొత్తం 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది మొత్తం 239 మంది ఉన్నారు. వీరందరితో విమానం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ఫ్లయిట్ గళ్లంతవడం మలేషియా చరిత్రలో అత్యంత ఘోరమైన ఘటనగా అభివర్ణించారు విశ్లేషకులు.

    మలేషియా ఎయిర్ లైన్స్ దీనిపై మీడియాకు అప్పట్లో ఒక ప్రకటన రిలీజ్ చేసింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 2.40 గంటలకు సంబంధాలు తెగిపోయాయని చెప్పింది. సంబంధాలు తెగిపోయిన 1.21 గంటలకు వెతుకులాట ప్రారంభించామని అధికారులు చెప్పారు. అప్పటికే వాతావరణంలో భారీ ప్రతి కూలత ఉందని అందుకే సిగ్నల్స్ కోల్పోయినట్లు తెలుస్తోందని మీడియా ప్రకటనలో యాజమాన్యం తెలిపింది.

    MH370కి సంబంధించి అన్వేషణ 9 సంవత్సరాలుగా కొనసాగుతోంది. దీని కోసం మలేషియా ఎయిర్ లైన్స్ అత్యంత ఖర్చు చేశాయి. అన్వేషణ టీం మొదట సౌత్ చైనా సీ అండ్ అండమాన్ సముద్రం పై దృష్టి సారించింది. ఇన్ మార్ శాట్ ఉపగ్రహంతో విమానంతో కొనసాగిన కమ్యునికేషన్, కట్ అయిన ప్రదేశం నుంచి కొనసాగింది. సుధీర్ఘ కాలం ఈ ఫ్లైట్ కోసం అన్వేషణ సాగింది. అయితే దీని కోసం వెతుకుతున్న జాయింట్ ఎజెన్సీ కోఆర్డినేషన్  సెంటర్ తమ కార్యకలాపాలను 2017లో నిలిపివేసింది. తర్వాత ‘ఓషన్ ఇన్ఫినిటీ’ అనే సంస్థ జనవరి, 2018 నుంచి MH370 గురించి వెతకడం ప్రారంభించింది.

    MH370 శకలాలను సముద్రం అడుగు భాగంలో గుర్తించామని, ఇందులో 239 మందికి సంబంధించిన అస్తి పంజరాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది పాత చిత్రం అంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు. ఈ ఫొటో MH370ది కాదని స్కూబా డైవర్లు గతంలో ఒక విమాన శకలాలను కనుగొన్నారని వాటిని MH370కి అపాదించారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికీ MH370 ఎక్కడ ఉందో తెలియదని చెప్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related