
అయితే తాజాగా అహ్మదాబాద్ లోని సబర్మతి నదిలో ‘అక్షర్ రివర్ క్రూయిజ్’ అనే నీటిపై తేలియాడే రెస్టారెంట్ ఆదివారం స్టార్ట్ అయింది. ఢిల్లీ నుంచి దీనిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధాని మోదీ చొరవతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. గుజరాత్ లో టూరిజం బలోపేతంలో భాగంగా ఇది ఏర్పాటు చేసినట్లు అమిత్ షా తెలిపారు. సబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్ లో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ముంబై, గోవాలలో మాత్రమే ఉన్న ఇలాంటి రెస్టారెంట్ ఇక్కడ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దీనిని అహ్మదాబాద్ లోని అక్షర ట్రావెల్స్, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ , సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. కాగా, ఈ రెస్టారెంట్ ను నిర్మించడానికి రూ. కోట్లు ఖర్చు చేశారు. దీనిపై కప్పుకూడా ఉండడంతో, వర్షకాలంలోనూ ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
అయితే ఈ క్రూయిజ్లో ఒక వ్యక్తి టూర్ ఖర్చు రూ. 2000. ఈనెల 10 నుంచి టికెట్ల విక్రయాలను ప్రారంభిస్తారు. 160 సీట్లు ఉన్న ఈ రెస్టారెంట్ క్రూయిజ్ సైజు 30 మీటర్ల పొడవు, మీటర్ల వెడల్పు ఉంటుంది. భోజనం చేస్తూ గంటన్నర పాటు ఎంజాయ్ చేయొచ్చు. సిటీలోని సర్దార్ బ్రిడ్జి నుంచి గాంధీ వంతెన వరకు ఈ క్రూయిజ్ ప్రయాణిస్తుంది. ఇంకేం గుజరాత్ వెళ్లే పర్యాటకులకు ఇది నిజంగా పండుగే. మోదీ రాష్ర్టంలో పర్యాటకం ఇప్పుడు కొత్త సొబగులు అద్దుకుంటున్నది. ఇప్పుడు క్రూయిజ్ రెస్టారెంట్ రాక ఇందులో భాగమే.
ReplyForward
|