Home Loan :
సొంతింటి నిర్మాణం ప్రతి ఒక్కరి కల. గృహం కట్టుకోవాలంటే రుణం తీసుకోవాల్సిందే. బ్యాంకులు అంత తొందరగా రుణాలు మంజూరు చేయవు. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లు ఇచ్చినా ఇంకా ఏదో కావాలని పేచీ పెడుతూనే ఉంటారు. దీంతో రుణం మంజూరు కావడానికి చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి పొరపాట్లు ఉంటే నెల్లాళ్లపాటు కూడా రుణాలు మంజూరు కావు. దీంతో మనం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే.
ప్రైవేటు వ్యాపారులకంటే బ్యాంకుల్లో వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయి. అందుకే అందరు బ్యాంకుల్లో రుణాలు పొందాలని భావిస్తుంటారు. బ్యాంకులు క్రెడిట్ స్కోరు ఆధారంగా రుణాలు ఇస్తాయి. వ్యక్తిగత క్రెడిట్ స్కోరు 750కి పైగా ఉంటే ఓకే లేదంటే మొండికేస్తారు. క్రెడిట్ స్కోరు రావాలంటే కూడా సమయం పడుతుంది. అందుకే బ్యాంకు రుణాలు అంత తొందరగా రావు.
కనీసం 2 నుంచి 3 ఏళ్ల ముందు నుంచే క్రెడిట్ స్కోరు పెంచుకునేదుకు ప్రయత్నించాలి. 3 లేదా 6 నెలలకు ఒకసారి మీ స్కోరు చెక్ చేసుకోండి. క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలు సకాలంలో చెల్లిస్తే మంచిది. క్రెడిట్ కార్డు పరిమితితో 30 నుంచి 40 శాతం మాత్రమే వాడుకోవాలి. గృహ రుణాలు పెద్ద మొత్తంలో పొందాలనుకుంటే మనకున్న చిన్న చిన్న రుణాలు తీర్చేయాలి.
ఇంట్లో ఇద్దరు జాబ్ లు చేస్తే ఇద్దరి పేరు మీద తీసుకుంటే ఎక్కువ వస్తుంది. దీంతో మన ఖర్చులు పోను కొంత మిగులుతుంది. దీంతో వాయిదాలు కూడా ఎక్కువగా పెట్టుకోవాలి. అప్పుడే మనకు బాధలు ఉండవు. ఈఎంఐలు ఎక్కువ రోజులు పెట్టుకుంటే తక్కువ అమౌంట్ కట్టుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. రుణాల కాల వ్యవధికి రుణాలు తీసుకున్న తరువాత మనకు వచ్చే డబ్బు ఆధారంగా చూసుకోవాలి. అంతేకాని ఇబ్బడిముబ్బడిగా పెట్టుకుంటే తీర్చడం కష్టమవుతుంది.