Food Poison : నంద్యాల జిల్లా వేంకటేశ్వరపురంలోని ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్, ఎస్డీఆర్ జూనియర్ కాలేజీలోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. సుమారు 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం అనంతరం వాంతులు, విరేచనాలతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
దీంతో గుట్టుచప్పుడు కాకుండా స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుల హాస్పిటల్ వద్దకు చేరుకొని తమ పిల్లలకు ఏమైందో తెలియక ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.