
Divorce :మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా ఆధునిక కాలంలో పెరుగుతున్న విడాకుల సమస్యపై ప్రజలకు అవగాహన కలిగించే అద్భుతమైన మాటలు మాట్లాడారు. మానసికంగా పరస్పరం అర్థం చేసుకోవడం, సహనం కలిగి ఉండటం, ఒకరినొకరు మార్పులు చేసుకోవడమే గట్టి సంబంధానికి మూలమైన అంశాలుగా పేర్కొన్నారు.
సాఫ్ట్ వేర్ రంగంలో అయితే ఇద్దరూ సంపాదిస్తూ ఏది అన్నా పడకుండా ఇగోలు, డబ్బు ఉందన్న భరోసాతో నెల కాకముందే విడాకులు తీసుకుంటున్నారు. ‘‘డబ్బు సంపాదిస్తున్నాం కదా, అందుకు ఎందుకు అడ్జస్ట్ అవ్వాలనే మైండ్‌సెట్ ఉంది. ఒకరితో అడ్జస్ట్ అవ్వకపోతే ఇంకొకరితో అడ్జస్ట్ అవుతారనే గ్యారంటీ ఏమిటి? మొదటి భాగస్వామి స్వభావాన్ని, ధోరణిని మార్చుకుని అడ్జస్ట్ అయితేనే సమాజం గౌరవిస్తుంది.’’ అంటూ రోజా విడాకులు పెరగడంపై సంచలన కామెంట్స్ చేశారు.






