
Allu Arjun : అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు చెబుతున్నాయి. దేశముదురు సినిమాలో అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసిన రంభ మళ్లీ అతనితో కలిసి నటించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే హై టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య రూపొందుతుండగా, రంభ పాత్ర సినిమా కథలో కీలకంగా ఉండబోతుందని సమాచారం. పూర్తి వివరాలు మాత్రం సినిమా విడుదలయ్యే వరకూ వెలుగులోకి రానట్టు మేకర్స్ సూచిస్తున్నారు.