Happy Friendship Day : స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అన్నాడో సినీకవి. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్నారు. స్నేహంలో ఉన్న గొప్పతనం అదే. మన కుటుంబ సంబంధాలను దేవుడే కలుపుతాడు. కానీ స్నేహితులను మాత్రం మనమే ఎంచుకుంటాం. పాఠశాల నుంచి మనకు స్నేహితులు అవుతారు. అందరు ప్రియ నేస్తాలు కాకున్నా కొందరు మాత్రం మనకు జీవితంలో అత్యంత సన్నిహితులుగా ఉండేవారుంటారు. మన హితం కోసం వారు అనుక్షణం ఆలోచిస్తారు. మన గమనంలో తోడు నీడగా నిలుస్తారు.
ఎలాంటి స్వార్థానికి లొంగనిది ఎంత త్యాగానికైనా వెనకాడనిదే స్నేహం. నీ స్నేహితులెవరో చెప్పు నీవెలాంటి వాడివో చెబుతాను అంటారు. మన స్నేహితుల గుణాల ఆధారంగానే మనల్ని కూడా అంచనా వేస్తారు. అలా మన స్నేహితుల్లో మంచితనం ఉంటే అదే మనకు వర్తిస్తుంది. అందుకే మన స్నేహితులను ఎంచుకోవడంలోనే మన గుణాలు తెలుస్తాయి.
జీవన గమనంలో మనకు నిత్యం సలహాలు ఇచ్చేవాడు స్నేహితుడు. అవసరమైన సమయంలో మనకు అండగా నిలిచేది కూడా ఫ్రెండే. ఇలా మన జీవితంలో స్నేహితుడు అన్ని వేళలా మనకు సాయపడతాడు. స్నేహం గురించి ఎంత వర్ణించినా తక్కువే. స్నేహానికి సాటి ఏదీ కాదు. ఎన్నేళ్లయినా స్నేహితులలో మంచితనమే కానీ చెడు స్వభావం ఉండదు.
పవిత్రమైన స్నేహానికి ఎల్లలు ఉండవు. నిజమైన స్నేహితుడు అంటే మన హితం కోరేవాడు. కష్టాల్లో తోడుండే వాడే ఫ్రెండ్. మనలోని లోపాలు ఎత్తి చూపేవాడే స్నేహితుడు.నిజమైన స్నేహితుడు అంటే మనలోని తప్పులను మన ముందే వెల్లడిస్తాడు. మనం లేనప్పుడు మనల్ని పొగిడేవాడే ఫ్రెండ్. మన ముందు పొగిడి మనం లేనప్పుడు స్నేహితుడు కానేకాడు. శత్రువుతోనే సమానం.
తెలివి తక్కువ మిత్రుడి కంటే తెలివి గల శత్రువే నయం అంటారు. స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు నెలలో మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్ షిప్ డేగా జరుపుకుంటారు. ఈ రోజు స్నేహితులను కలుసుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇంకా ఫ్రెండ్ షిప్ బ్యాండ్లు కట్టుకుంటారు. స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.