Nata Cultural Programs :
అమెరికాలోని ఇండియన్స్ సంఘాలలో ఏర్పాటు చేసిన సంఘంలో ఒకటి ‘నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా)’. సంస్కృతిక వికాసం, సమాజ సేవయే నాటా బాటగా కొనసాగుతుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘంగా యూఎస్ లో ప్రసిద్ధి చెందిన ఇది. భారీ కార్యక్రమాలు చేస్తూ తెలుగు వారిని వీరితో పాటు ఇండియన్స్ దృష్టి తన వైపునకు మళ్లించుకుంటుంది. ప్రతీ ఏటా భారీ కార్యక్రమాలు చేపడుతుంది. అంతెందుకు ప్రతీ నెల కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
జూన్ 30వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు అంటే మూడు రోజుల వరకు నాటా మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. డల్లాస్ మహానగరంలోని డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ లో కార్యక్రమాలు జోరందుకున్నాయి. తెలుగు వారు గర్వపడేలా వారి కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందేలా సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు జూన్ 30వ తేదీ కార్యక్రమాలు వైభవంగా కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు.
మొదటి రోజు వేడుకల్లో సంస్కృతిక ప్రదర్శనలు మిన్నంటాయి. కృష్ణ భక్తి, తెలుగువారి తెలంగాణ సమాజం బతుకమ్మ వేడుకలు లాంటి కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు నాటా సభ్యులు. ఈ కార్యక్రమాలను నాటా ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొరసపాటి అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరు నిర్వహించే ప్రతీ కార్యక్రమానిక సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని నాటా సమాజంతో పాటు పలువురు విపరీతంగా షేర్ చేస్తున్నారు.
ఈ వేడుకలు ఇంకా రెండు రోజుల పాటు కొనసాగుతాయి. అక్కడి తెలుగు సమాజం స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా భోజనం, కార్యక్రమాలను వీక్షించే స్థలం సభా స్థలం లాంటి వాటిలో మరింత కన్వినెన్స్ కల్పిస్తుంది. ఒక్క రోజుతో ఊపందుకున్న కార్యక్రమాలు మరో రెండు రోజుల పాటు పీక్ కు వెళ్లనున్నాయి.