UPI Lite : ప్రపంచంతో చూసుకుంటే ఇండియాలో డిజిటల్ చెల్లింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎక్కడ ఛాయ్ తాగినా సరే రూ. 10 ఇవ్వాల్సి వస్తే ఫోన్ తీయడం ట్రాన్ఫర్ చేయడం ఇదే సాగుతుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం తీసుకువచ్చిన యూపీఐ లైట్ కూడా మనీ ట్రాన్స్ ఫర్ కు ఉపయోగపడుతుంది.
అయితే గతంలో దీంతో కేవలం రూ. 200 మాత్రమే చెల్లింపులు చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు ఆ పరిమితిని రూ. 500 వరకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న లావాదేవీలు, అవసరాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే వ్యాలెట్ లో లోడ్ చేసుకునే డబ్బును మాత్రం రూ. 2 వేలకే పరిమితం చేసింది. అంతకన్నా ఎక్కువ డబ్బును వ్యాలెట్ లోకి పంపేందుకు అనుమతించదు.
ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులవిషయంలో రిస్క్ లు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాలెట్ పరిమితిని పెంచలేని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూపీఐ లైట్ తమకు బాగా ఉపయోగపడుతుందని, దీని ద్వారా తక్కువ మొత్తంలో చెల్లింపులు చేయడంతో ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు ఆ బాధ తీరిందని అంటున్నారు. ఆర్బీఐకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.