Tollywood Interviews :
పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’తో నాగశౌర్య మళ్లీ అభిమానుల ముందుకు వస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూలై 7వ తేదీ) విడుదల అవుతుంది.
రంగబలిలో నాగశౌర్య హీరోయిజం కనిస్తుందని గతంలో డైరెక్టర్ పవన్ చెప్పాడు. నిర్మాత సుధాకర్ చెరుకూరి దేనికి కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘ఓ వ్యక్తి కథ వినమని సూచించి పవన్ పేరును సిఫార్సు చేశాడు. అతని పేరు నేను వెల్లడించలేను. మనం కలిసి పనిచేసినప్పుడల్లా అది బ్లాక్‌బస్టర్ కంటే తక్కువ కాకూడదని సుధాకర్ నాతో చెప్పేవారు. అదృష్టవశాత్తు మనకు డైరెక్టర్ గా పవన్ దొరికాడు. నేను చూసిన అత్యంత నిజమైన వ్యక్తుల్లో అతను ఒకడు. అతను ఎప్పటికీ ఒకే వ్యక్తిగా ఉంటాడని నేను ఆశిస్తున్నాను. నేను అతని కుటుంబానికి చెబుతున్నాను; పవన్ పెద్ద డైరెక్టర్ అవుతాడు’. అన్నాడు నాగశౌర్య.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగశౌర్యను కమెడియన్ సత్య ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేమ్ అవుతుంది. ఇందులో సత్య ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ అవతారం ఎత్తి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను తలపించారు. సినిమా గురించి డిఫరెంట్ క్వశ్చన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ఆ సాంతం విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా గురించి దాదాపు ఎక్కువ సమాచారం తెలుసుకునేందుకు సత్య ప్రయత్నించగా నాగశౌర్య కూడా పూర్తిగా ఓపెన్ కాకుండా చెప్పాడు. సినిమా ఎలా ఉన్నా వీరి ఇంటర్వ్యూ మాత్రం బాగుందని పలువురు ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు.






