Gadar 2 Trailer గదర్ 2 : ది కథ కంటిన్యూస్.. ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేసారు మేకర్స్.. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది? ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తుందా లేదా అనే రివ్యూ ఇప్పుడు చూద్దాం..
గదర్ 2.. గదర్ ఏక్ ప్రేమ్ కథా సీక్వెల్ గా తెరకెక్కింది.. సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన గదర్ ఏక్ ప్రేమ్ కథ సినిమా 2001లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది.. మరి ఈ సినిమా అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా గదర్ 2 తెరకెక్కింది.
ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు.. ఈ క్రమంలోనే ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది.. దీనిలో భాగంగానే ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోగా ఇప్పుడు ట్రైలర్ ను లాంచ్ చేసారు. రిలీజ్ కు మరో రెండు వారాలు మాత్రమే ఉండడంతో ఈ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లాలని వరుస ప్రమోషన్స్ కోసం సిద్ధం అయ్యారు..
ఈ ట్రైలర్ 1971 కాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది.. ఇండియన్ – పాకిస్థాన్ సోల్డజర్స్ మధ్య కథ సాగుతుంది.. తారా సింగ్ పాత్రలో సన్నీ డియోల్ నటించగా ట్రైలర్ మొత్తం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్ అండ్ విజువల్స్ కూడా ఆడియెన్స్ ను అలరించే విధంగా ఉన్నాయి.. ఈ సినిమాను అనిల్ శర్మ డైరెక్ట్ చేయడమే కాకుండా నిర్మించారు.. శక్తిమాన్ తల్వార్ కథ అందించగా ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది. మరి ఎలా అలరిస్తుందో వేచి చూడాలి..
https://www.youtube.com/watch?v=mljj92tRwlk&t=122s