33.4 C
India
Wednesday, May 21, 2025
More

    Game Changer : 10 రోజుల్లో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కంప్లీట్..

    Date:

    Game Changer
    Game Changer

    Game Changer : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే రామ్ చరణ్ త్వరలోనే తన పోర్షన్ కంప్లీట్ చేసుకోబోతున్నాడు. మరో 10 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని మరో ప్రాజెక్టులోకి వెళ్లనున్నాడు. అయితే, ఇంకా సినిమా చిత్రీకరణ కొనసాగుతుంది. కానీ రామ్ చరణ్ పోర్షన్ మాత్రం పది రోజుల్లో ముగియనుందని మేకర్స్ ప్రకటించారు.

    రామ్ చరణ్ షూటింగ్ షెడ్యూల్ లో చాలా బిజీగా ఉన్నాడని, దీని తర్వాత బుచ్చిబాబు ప్రాజెక్టుకు వెళ్లనున్నాడని ఇండస్ట్రీ నుంచి లీకులు వస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరోసారి రామ్ చరణ్ ఈ సినిమాలో యూనిఫామ్ లో కనిపించనున్నాడు. ఆర్ఆర్ఆర్ లో పోలీస్ ఆఫీసర్ అయితే.. గేమ్ ఛేంజర్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. కియారా అద్వానీతో పాటు అంజలి కూడా కీలక పాత్రలో కనిపించనుందని మేకర్స్ తెలిపారు. ఇక ప్రతి నాయకుడి పాత్రలో ఎస్‌జే సూర్య నటించనున్నారు.

    గేమ్ ఛేంజర్ సినిమాతో తమిళ దర్శకుడు శంకర్ నేరుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఇది అతని ఫస్ట్ స్ట్రయిట్ తెలుగు ఫిలిం. అయితే, శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమాలన్నీ కేవలం డబ్ మాత్రమే. ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ సినిమాను తమిళంలో కూడా తెరకెక్కిస్తున్నారు శంకర్.

    పిజ్జా, జిగర్తాండతో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ‘గేమ్ ఛేంజర్’కు కథ రాశారు. శంకర్ తన దర్శకత్వ శైలికి తగినట్లుగా కార్తీక్ కథను రెడీ చేశారు. ఒక దర్శకుడు మరో దర్శకుడి కోసం రాసిన మొదటి కథ ఇది.

    అవినీతిపరులైన రాజకీయ నాయకులను ఎదుర్కొనే ఒక ప్రభుత్వ అధికారిగా హీరో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఐఏఎస్ అధికారి చుట్టూనే కథ తిరుగుతుంది.  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ కొత్త గెటప్ లో కనిపిస్తుండడంతో కొంత మందికి ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Game Changer : గేమ్ చేంజర్ నుంచి లేటెస్ట్ రూమర్ ఇదీ

    Game Changer : దిగ్గజ దర్శకుడు శంకర్ తన కెరీర్‌లో తొలిసారిగా రామ్...

    Telugu Film Industry : ఈ ఏడాది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఆదుకునేది ఈ మూడు సినిమాలే

    Telugu film industry : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం...