Ganapati Celebrations : ప్రపంచ దేశాల్లో గణపతి ఉత్సవాలు మంగళవారం (సెప్టెంబర్ 19) ప్రారంభమయ్యాయి. భారత్ తో పాటు అనేక దేశాల్లో గణపతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. భారతీయులు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ గణపతి కొలువు దీరి పూజలు అందుకుంటుంటాడు. స్వామి వారిని కొలిసేందుకు నిర్వాహకులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తారు.
చతుర్థి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఫల, పుష్ప, నైవైద్యాలతో గణ నాథుడిని పూజించి తరిస్తారు. కోరిక కోర్కెలు తీర్చే బొజ్జ గణపయ్యకు దేశ దేశాల భక్తులు ఘనంగా నీరాజనాలు సమర్పిస్తారు. తొమ్మిది రోజుల పాటు వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి. రోజుకు ఒక నైవేద్యం సమర్పించి వేడుకుంటారు. ఇక ప్రతీ రోజు సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి చిన్నా, పెద్ద తేడాల లేకుండా భజనలు, కీర్తనలు ఆలపిస్తారు.
అమెరికాలోని న్యూజెర్సీలో భారీ గణపతి ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు సెప్టెంబర్ 19న మొదలై సెప్టెంబర్ 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వుడ్ బ్రిడ్జి సెంటర్ మాల్ 250లో వుడ్ బ్రిడ్జి సెంటర్ డ్రైవ్, వుడ్ బ్రిడ్జి న్యూ జెర్సీ 07095లో గణపతిని ప్రతిష్టించి రోజుకో వేడుక చేస్తున్నారు. ఈ గణపతిని 1947 ప్రొడక్షన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. భక్తులు అందరూ పాల్గొని వేడుకలను వైభవంగా నిర్వహించాలని కోరుతున్నారు.
ఈ వేడుకలను 1947 ప్రొడక్షన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతీ ఏటా కంటే కూడా ఈ సారి మరింత వైభవోపేతంగా.. భారీగా ఉత్సవాలు కొనసాగుతున్నాయిని చెప్తున్నారు.