Eco-Friendly Ganapati :
పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. మనం చేసే తప్పిదాలే మనకు నష్టాలను తెస్తున్నాయి. పర్యావరణాన్ని మనం కలుషితం చేయడం వల్ల వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. అకాల వర్షాలు వస్తున్నాయి. దీంతో మనకు అనేక రకాల చేటు జరుగుతుంది. కానీ మనం మేల్కోవడం లేదు. విమానాలు నడపడం వల్ల ఓజోన్ పొర దెబ్బ తింటోంది. దీంతో మనం విపత్తులు ఎదుర్కొంటున్నాం.
మనం ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా వినాయకుడి ప్రతిమలు పెడుతున్నాం. ఇవి కలర్లు, రసాయనాలు వాడటం వల్ల మన వాతావరణం కలుషితంగా మారుతోంది. అందుకే మట్టి గణపతులను వాడాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. మనసుంటే మార్గముంటుంది. మనం చొరవ చూపితే కానిది ఏముంటుంది. మనలో ఉన్న నిర్లక్ష్యమే మనల్ని చెడు వైపు తీసుకెళ్తోంది.
ఈనేపథ్యంలో గోవాలో గణపతిని వినూత్నంగా తయారు చేశారు. మొత్తం వెదురు బొంగులు, అరటి కాయలతో విఘ్నేషుడిని తయారు చేయడం గమనార్హం. దీంతో లంబోదరుడు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. పచ్చని కలర్ లో ఆకట్టుకుంటున్నాడు. ఇలా చేయడం వల్ల పర్యావరణం బాగుంటుంది. గోవాలోని ఓ గ్రామంలో ఇలా అరటి కాయలతో గణపతిని తయారు చేశారు.
తొమ్మిది రాత్రులు పూర్తయ్యాక అరటిపండ్లు పండుతాయి. దీంతో వాటిని భక్తులకు పంచి పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యావరణ కాలుష్యం లేకుండా చేయడానికే ఇలా చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అరటి కాయలతో వినాయకుడిని తయారు చేయడం వల్ల వాతావరణ కాలుష్యం దెబ్బతినకుండా ఉంటుందని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.