Gas connections : చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నేత. దాదాపు దేశంలో ఏ రాష్ట్రంలో ఏని పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, నిధుల సేకరణ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హాయాంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో జరిగేవి. అందుకే తక్కువ సమయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పేరు నలు దేశాల్లో పాకింది. బిల్ క్లింటన్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వంటి వందలాది మందిని రాష్ట్రానికి రప్పించారు. ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) అంటే తెలియని రాష్ట్రాలు ఎన్నో ఉన్నా.. అప్పటికే హైదరాబాద్ ను ఐటీకి అడ్డాగా మార్చరు. దక్షిణ భారతంలో భాగ్యనగరం పేరు ఇప్పుడు ఇంతలా మోగుతుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ఆయన విజన్ నుంచి వచ్చింది ఫ్రీ సిలిండర్ పథకం. అప్పట్లో ఈ పథకం గుజరాత్ లో మోడీ సీఎంగా ఉన్న సమయంలో జరిగింది. దీన్ని ఎలాగైనా రాష్ట్రానికి తీసుకురావాలనుకున్న చంద్రబాబు నాయుడు ఆ దిశగా ప్రయత్నాలు చేసి విజయం సాధించాడు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మహిళలకు ఉచిత సిలిండర్లను అందించారు. సిలిండర్లనే కాదు గ్యాస్ స్టౌలను కూడా పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలోనే కట్టెల పొయ్యిలు అటకెక్కాయి. అటకే కాదు.. వాటి జాడ కనిపించకుండా పోయాయి.
ఆ సమయంలో గ్యాస్ సిలిండర్ అంటే ప్రజలకు తెలిసేది కాదు. అయినా ఈ పథకం బాగుందనుకున్నారు. వందలాది మంది గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టౌలను తీసుకున్నారు. ఆ విధంగా ఇప్పుడు కూడా ప్రతీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండాల్సిందేనని చంద్రబాబు ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకు తాను అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నానని, త్వరలో ప్రతీ ఇల్లు గ్యాస్ సిలిండర్ తో ఉంటుందని, ఆడపడుచులు పొయ్యిలతో పాట్లు ఇక చూడలేం అన్నారు. ఇటీవల జరిగిన ఒక ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ఆడ పడుచుకులకు హామీ ఇచ్చారు.