GATA Sankranti Celebrations : గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ (GATA) 2024, జనవరి 21 ఆదివారం రోజు ‘సంక్రాంతి సంబురాలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జార్జియాలోని అల్ఫారెట్టాలో ఉన్న దిసనా మిడిల్ స్కూల్ వేదికగా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎవరెస్ట్ టెక్నాలజీస్ ఈ ఉత్సవ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తోంది.
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. అత్యంత ప్రతిభావంతులైన అట్లాంటాల సాంస్కృతిక కార్యక్రమాలు, రంగోలి పోటీలు, భోగి పళ్లు, కిడ్స్ కోసం గాలిపటాలు, గ్రాండ్ రాఫిల్ బహుమతులు, షాపింగ్ కోసం వెండర్ స్టాల్స్ వంటివి కొన్ని ఆకర్షణలు. ఈ షోకు ఆర్జే సుజీ ఎంసెట్‌గా వ్యవహరించనున్నారు. రిజిస్ట్రేషన్ కోసం www.NRI2NRI.com/GATA లో సందర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఇక, సాయంత్రం సమయంలో పండుగ ప్రత్యేక బంతి భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ఈవెంట్‌కు ప్రవేశం ఉచితం, అయితే డిన్నర్ టిక్కెట్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిన్నర్ కార్యక్రమాన్ని బిర్యాని పాట్ స్పాన్సర్ చేస్తుంది. ఇందులో పూర్ణాలు, చిట్టి గ్యారెలు, మామిడి పులిహోర, ముద్దపప్పు ఆవకాయ అన్నం, మజ్జిగా చారు, దద్దోజనం, టమాటో రోటీ పచ్చడి తదితర ఐటంలను వడ్డించనున్నారు. సభ్యులకు 10 డాలర్లు, బయటి వారికి 15 డాలర్లు, చిన్నారులకు 5 డాలర్ల కొప్పన కేటాయించారు. మరిన్ని వివరాల కోసం ఫ్లైయర్‌ని తనిఖీ చేయండి మరియు ఏవైనా సందేహాలుంటే నిర్వాహకులను సంప్రదించండి.