
Stress : ఈ రోజుల్లో ఒత్తిడి సాధారణమైన సమస్య. అందరిని ఇది కలవరపెడుతోంది. చీటికి మాటికి కోపానికి రావడం డిప్రెషన్ లోకి వెళ్లడం సహజమే. కానీ ఇది ముదిరితే ప్రమాదమే. ఏదైనా అతి అనేది మంచిది కాదు. అది మంచైనా చెడైనా కావొచ్చు. అతి మంచితనం పనిచేయదు. అతి చెడు పనికి రాదు. ఏదైనా సమపాళ్లలో ఉంటేనే సురక్షితం. దీనికి చాలా సహనం కావాలి. జీవితంలో కోపానికి రాని మనిషి ఉండడు. అలాగే డిప్రెషన్ లోకి వెళ్లని వారు కూడా ఉండరు. ఏదో ఒక సందర్భంలో ఒత్తిడికి లోనుకావడం సహజం.
మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఒత్తిడి రాదు. కానీ క్షణకాలంలోనే మన మెదడు అదోలా అయిపోవడం ఖాయం. మనకు ఇష్టం లేనిది ఏదైనా జరిగితే వెంటనే మనకు కోపం వస్తుంది. దాంతోనే డిప్రెషన్ వస్తుంది. దీని ద్వారా మన మెదడు మందగిస్తుంది. ఏం చేస్తున్నామో అర్థం కాదు. అవతలి వ్యక్తి మీద అరుస్తుంటాం. ఒత్తిడికి తలొగ్గితే మనం ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు.
ఒత్తిడికి గురైనప్పుడు కళ్లు మూసుకుని ప్రశాంతంగా ఉండాలి. తప్పు ఎక్కడ జరిగిందని ఆలోచించాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆవేశం కలిగినప్పుడు ఒకటి నుంచి పది వరకు అంకెలు లెక్కపెట్టాలి. దీంతో మనలో ఉన్న ఆవేశం మెల్లగా చల్లబడుతుంది. అప్పుడు ప్రశాంతం వస్తుంది. ఊపిరి మెల్లగా తీసుకోవాలి. మనసును ఒకే దాని మీద పెట్టాలి.
మనసు కుదుట పడటానికి మంచి సంగీతం వినాలి. అప్పుడు మన మెదడు ప్రశాంతం వైపు ఆలోచిస్తుంది. ప్రతికూల పరిస్థితులను వదిలేయండి. అనుకూలమైన వాటికోసమే ఆలోచించాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడిని దూరం చేసుకోవడం పెద్ద విషయమేమీ కాదు. కానీ తరచుగా ఒత్తిడికి గురయితే మన నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు కోపాన్ని అదుపులో పెట్టుకోవడమే బెటర్. అందుకే అంటారు తన కోపమే తన శత్రువు అని.