Ghost in the car : గత నెల రోజులనుండి స్మశానం వద్ద రోడ్డు పక్కనే అనుమాస్పద స్థితిలో సగం తగలబడిన కారుని వదలివెళ్లిన గుర్తు తెలియని వ్యక్తుల వ్యవహారం భయం గొలుపుతోంది. ఈ కారు నుంచి రాత్రులు వింత శబ్దాలు వస్తూ నిదుర లేకుండా చేస్తున్నాయి అని కొంతమంది అంటున్నారు. ఇది పుకారో లేక నిజమో అని భయాందోళనలో ఉన్నామని కాలనీ వాసులు భయం వ్యక్తం చేస్తున్నారు..
చిన్నపిల్లలు, ఆడ పిల్లలు ఉన్నారు బడికి వెళ్లి రావాలంటే భయపడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని అదునగా చూసుకొని కొంతమంది ఆకతాయిలు వీడియో రికార్డ్ చేసిన ఆడియోను వాట్సాప్ మాధ్యమాల్లో పెట్టి పుకారులేపి చుట్టుపక్కల వారిని భయానికి గురి చేస్తున్నారు…
పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదంటూ ఆరోపిస్తున్నారు..