- ఇంటి నుంచి పరార్

Girl Love Sister In law and Married : ప్రేమ గుడ్డిదంటారు.. ప్రేమ పుట్టేందుకు ప్రత్యేక కారణం అంటూ ఉండదని అంటారు. మనసులు కలిస్తే చాలు.. ప్రేమ కోసం కొందరు కుటుంబాలను వదిలేస్తే.. మరికొందరు ప్రాణాలే వదిలేస్తుంటారు. ఇష్క్, మోహబత్, లవ్, ఇలా ఏ భాష అయినా ప్రేమ ఒక్కటే. ఆకర్షణ, ప్రేమకు తేడా తెలియని వయస్సులో కొందరు ప్రేమ అంటూ పారిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అదే సమయంలో వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. అయితే అబ్బాయి అబ్బాయిని, అమ్మాయి అమ్మాయిని ప్రేమించడమే ఇక్కడ వింత. ఇష్టాన్ని ప్రేమ పేరుతో ప్రకటించుకొని రోడ్డుకెక్కుతున్నారు. కొందరు ప్రేమే తమ జీవితమనుకుంటారు. ఇంటి నుంచి పారిపోయి అష్టకష్టాలు పడుతుంటారు.
యూపీలో వదినా మరదళ్ల ప్రేమ కథ..
యూపీలో ఓ వదినామరదళ్లు ప్రేమించుకున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని బహజోయ్ ప్రాంతానికి చెందిన వదినామరదళ్లు ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. కొంతకాలంగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇంట్లో పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోరని భావించారు. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఇంకేం సామనంతా సర్దేశారు. ఏడు నెలల క్రితం ఇంటి నుంచి పరారయ్యారు. తర్వాత కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అచూకీ లభించలేదు. పోలీసులు కూడా వెతికినా లాభం లేకుండా పోయింది.
అయితే ఇటీవల వీరిద్దరు స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. తాము ప్రేమించుకున్నామని, కలిసి బతకాలని అనుకుంటున్నామని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ప్రస్తుతం వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు. ఇదండీ వీరి ప్రేమ సంగతి. అటు తిరిగి.. ఇటు తిరిగి చివరకు ఇంటికే చేరాల్సి వచ్చింది.