పాములంటేనే భయపడి పారిపోతుంటాం.. పాము కనిపిస్తే చాలు.. కొందరికైతే గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఇక మరికొందరైతే పాములంటే భయం లేకుండా ముందుకెళ్తుంటారు. వాటిని సునాయసంగా చేతులతో పట్టుకొని ఆడుకుంటుంటారు. ప్రాణాల మీదకు వస్తుందని తెలిసినా, వీరి సాహసాలు ఆగవు. ఇలాంటి స్నేక్ క్యాచర్లు అన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంటారు. అయితే ఇలాంటి స్నేక్ క్యాచర్లు ఇటీవల కాలంలో కొందరు వాటి కాటుతో మృతి చెందారు కూడా .
ఇలాంటి పాములు పట్టే వారి వీడియోలు మనకు సోషల్ మీడియాలో విరివిగా కనిపిస్తుంటాయి. బుసలు కొట్టే పాములను కూడా కొందరు అలవోకగా చేతుల్లో పట్టుకొని సాహసం చేస్తంటారు. ఇట్లాగే ఓ యువతి వీడియో కూడా తాజాగా వైరల్ అవుతున్నది. సదరు యువతి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే పాములను పట్టుకొని ఆడుకుంటున్నది. అయితే నెటిజన్లు మాత్రం అవి పాములనుకుంటున్నవా.. తాళ్లనుకుంటున్నవా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాలువ పక్కన ఉన్న ఓ రెండు విషసర్పాల వద్దకు వెళ్లిన సదరు యువతి, వాటి తోకలు పట్టుకొని జిమ్ సెంటర్ లో రోప్ వర్కవుట్స్ చేసినట్లుగా చేస్తుంటుంది. అవి కాటు వేస్తాయనే భయం కూడ లేకుండా వాటితో ఆడుకుంటుంది. ఈ క్రమంలో ఓ పాము ఆమె నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటుంది.
అయినా ఆ పామును వదలకుండా సదరు యువతి పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. కాలువలోకి దూరి మరి దానిని బయటకు లాక్కొస్తుంది. అక్కడే ఉన్న స్థానికులు దానిని వీడియో తీసి నెట్టింట పెట్టారు. ఇక ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. పాములకు చుక్కలు చూపించందంటూ కొందరు. ఇలాంటి పనులెంటి అంటూ మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం పెద్ద సంఖ్యలో నెటిజన్లు లైకులు కోడుతూ కామెంట్లు పెడుతున్నారు.