24.9 C
India
Friday, March 1, 2024
More

  Girls Fighting : సెల్ఫీ కోసం కొట్టుకున్న మహిళలు.. వైరల్ వీడియో

  Date:

  Girls Fighting
  Girls Fighting

  Girls Fighting : ఈ రోజుల్లో మనుషుల్లో సహనం తగ్గుతోంది. దేనికైనా ఓపిక ఉండటం లేదు. ఏం బిజీ లేకపోయినా ఎక్కడ ఆగడం లేదు. నాదే ముందు కావాలనే ధోరణితో ఉంటున్నారు. దీంతో గొడవలకు కూడా వెనకాడటం లేదు. ఏదో రెండు నిమిషాలు ఆగితే సరిపోతుంది కదా అనే ఆలోచన రావడం లేదు. ఫలితంగా జుట్లు పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్తున్నారు. ముప్పై ఆరు జుట్టు కూడి ఉంటాయి కానీ మూడు సిగలు కూడి ఉండవనేది సామెత.

  తాజాగా గుంటూరు జిల్లాలో ఈనెల 6న గాంధీ పార్కును ప్రారంభించారు. నగరంలో ఉన్న ఏకైక పార్కు కావడంతో జన సంచారం పెరిగింది. రోజుకు వేలల్లోనే వస్తున్నారు. వీకెండ్స్ అయితే ఇక చెప్పనక్కర లేదు. పార్కును ఆధునీకరించడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. చిన్న పిల్లలకోసం ప్రత్యేకంగా గేమ్ జోన్, టాయ్ ట్రెయిన్, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు.

  దీంతో చిన్నారులతో పాటు పెద్దలు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. సెల్ఫీ పాయింట్ల వద్ద సెల్ఫీలు తీయించుకుంటున్నారు. సెల్ఫీ పాయింట్ల వద్ద రద్దీ ఎక్కువవుతోంది. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు తాము ముందంటే తాము ముందు సెల్ఫీలు తీసుకుంటామని పోటీ పడ్డారు. దీంతో మాటల యుద్ధం పెరిగింది. అది కాస్త ముష్టి ఘాతాలకు దారి తీసింది.

  ఇలా ఇద్దరు మహిళలు కొట్టుకుంటుంటే వారిని ఆపాల్సింది పోయి ఆ గొడవను కూడా సెల్ లో బంధించారు. ఎవరు కూడా వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా చోద్యం చూశారు. దీంతో వారి ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరు సెల్ఫీలు తీసుకోవాల్సిందిపోయి వారి గొడవను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడటం గమనార్హం.

  Share post:

  More like this
  Related

  Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

  Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

  Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

  Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

  Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

  Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

  Chanakya Niti : పెళ్లయిన మగవారు ఇతర స్త్రీల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు? చాణక్య చెప్పిన విషయాలు ఏంటి?

  Chanakya Niti : ఆచార్య చాణక్య గొప్ప పండితుడు. తనను అవమానించని...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Panipuri : గుంటూరులో పానీ పూరి విక్రయాలు నిలిపివేత

  Panipuri : గుంటూరులో డయేరియా కేసులు పెరుగు తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు...

  Supreme Court : గృహిణిల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి,కానీ..సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

  Supreme Court : గృహిణిల సేవ‌ల వెల‌క‌ట్ట‌లేనివి.. వారి సేవ‌ల‌ను ఆర్థిక...

  Selfie with Lion : సింహంతో సెల్ఫీ.. కట్ చేస్తే పరలోకం..

  Selfie with Lion : మృగరాజైన సింహంతో ఆట అంటే ప్రాణాలు...

  Ghosts : దెయ్యాలు లేవంటే నమ్ముతారా?

  Ghosts : చీకటిని చూసి జడుసుకుంటే చెట్టే చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది....