
peace of mind : అన్ని సమస్యలకు మనసే మూలం. కోరికలకు మనసే కారణం. మనసుతో చాలా సమస్యలొస్తాయి. అందుకే కళ్లు వెళ్లిన చోటుకు మనసు వెళ్లకూడదు మనసు వెళ్లిన చోటుకు మనిషి వెళ్లకూడదని చెబుతారు. మనసు మనల్ని కోతిలా మారుస్తుంది. ఏ పనైనా చేయాలని చెబుతుంది. కానీ ఆత్మ మాత్రం ప్రబోధం మనకు మంచినే చెబుతుంది. మనసు చెప్పినట్లు వింటే మనకు ఇబ్బందుల వస్తాయి. ఆత్మ ప్రకారం నడుచుకుంటే మనకు కష్టాలు రాకుండా ఉంటాయి.
మనసు అభౌతికమైనది. దానికి రూపం ఉండదు. కానీ అది మనిషిని కంట్రోల్ చేస్తుంది. కోరికల గుర్రాలపై ఊరేగమంటుంది. ఎక్కడకైనా క్షణాల్లో వెళ్తుంది. అన్నింటికంటే వేగంగా వెళ్లేది కూడా మనసే. దీంతో మనసుపై అదుపు ఉండాలి. లేకపోతే జీవితం కష్టాలమయం అవుతుంది. దీంతో మనసనే పుష్పక విమానం మీద విహరించే మనసు మనకు తంటాలు తెచ్చిపెడుతుంది.
గౌతమ బుద్ధుడు భౌతిక చర్యల మీదే ఆధారపడాలని చెప్పాడు. మనసు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ఆలోచలకు తక్షణ రూపం కలిగించే మనసే ప్రధానం. అందుకే మనసు మనల్ని ఎన్నో విధాలుగా ఉరుకులు పెట్టిస్తుంది. ఏవేవో కావాలంటుంది. అది కోరినవన్ని ఇవ్వాలంటే కుదరదు. మనం కష్టాల్లో పడతాం. అందుకే మనసుకు కళ్లెం వేయడం మంచిది.
మనసు మాట వింటే మనకే తిప్పలు తప్పవు. ఈ క్రమంలో మనసును కాస్త అదుపులో ఉంచుకోవాలి. ఆలోచనలను కట్టడి చేసుకుంటేనే మంచిది. కొండ మీది కోతి కావాలని కోరటం మనసుకే చెల్లుతుంది. మనసు చెప్పినట్లు వింటే మన మతి పోవడం గ్యారెంటీ. అందుకే మనసుకు ఎప్పటికప్పుడు సర్దిచెప్పుకోవాలి. అన్ని కావాలని అడిగితే మన బతుకు భారం అవుతుందని తెలుసుకోవాలి.