Allu Shirish Buddy : అల్లు శిరీష్.. అల్లు అరవింద్ రెండవ కుమారుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. అయితే ఈ యంగ్ హీరో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దం అవుతున్న ఇప్పటి వరకు ఇతడికి చెప్పుకోదగ్గ హిట్ మాత్రం దక్కలేదు.. ఒక వైపు అన్నయ్య అల్లు అర్జున్ పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటే తమ్ముడు మాత్రం తెలుగులో యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇవ్వలేక పోతున్నాడు..
గత ఏడాది ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో వచ్చాడు.. అను ఇమ్మాన్యుయేల్ తో మంచి కెమిస్ట్రీ అయితే వర్కౌట్ అయ్యింది కానీ ఈ సినిమా కమర్షియల్ గా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేక ఇతడికి మరోసారి నిరాశనే మిగిల్చింది.. అప్పటి నుండి మళ్ళీ లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ ను నమ్ముకుని కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
అయితే ఈసారి ఇతడు డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. థ్రిల్లర్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోయే ‘బడ్డీ’ అనే సినిమాలో అల్లు శిరీష్ నటిస్తున్నాడు.. ఈ సినిమా నుండి ఈ రోజు గ్లింప్స్ రిలీజ్ అవ్వగా ఇది బాగా ఆకట్టు కుంటుంది. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాతో అల్లు శిరీష్ హిట్ అందుకుంటాడు అని అనిపిస్తుంది.
తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాకు సామ్ ఆంటోనీ దర్శకత్వం వహించగా హిప్ హాప్ సంగీతం అందించారు. అల్లు శిరీష్ సరసన ప్రిషా రాజేష్ సింగ్ కథానాయికగా నటిస్తుండగా అజ్మర్ అమీర్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ ముందు వెల్కమ్ టు టెడ్డీ వరల్డ్ అనే క్యాప్షన్ ఇవ్వడంతో బొమ్మల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. మరి ఈ థ్రిల్లర్ జోనర్ అయిన అల్లు శిరీష్ కెరీర్ ను సరికొత్త మలుపు తిప్పుతుందో లేదో చూడాలి..