MLC Kavitha : కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల్లో మహిళ లకు జీవో నెంబర్ 3 శరాఘాతం గా తెలుస్తోందని BRS ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎమ్మె ల్సీ కవిత దీక్షకు దిగారు. ఏ జీవో ద్వారా మహిళ లకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగు తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు న్యాయం జరిగే జీవో 41నీ అమలు చెయ్యాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికా రంలోకి వచ్చి అభివృద్ధి చేయకుండా మాయమా టలు చెబుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపిం చా రు. మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 3 ను ఎందుకు అమలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు క్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారనీ ఆమె మండిపడ్డారు. 500 లకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.