Birla Radhakrishna Mandir : గోవా అంటే బీచులు.. పార్టీలు.. అందమైన అమ్మాయిలే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే మరోవైపు మాత్రం గోవాలో ఆధ్మాత్మిక కేంద్రంగాను కీర్తి గడిస్తోంది. గోవాలో హిందూ.. క్రిష్టియన్.. ఇతర మతాలకు చెందిన ఎన్నో ఆలయాలు.. మందిరాలున్నాయి. 2023లో గోవాలో చూడదగిన ఆలయాల్లో బిర్లా రాధాకృష్ణ టెంపుల్ ముందువరుసలో ఉంది.
సౌత్ గోవా దబోలిమ్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో బిర్లా రాధాకృష్ణ టెంపుల్ ఉంది. 3.6 ఎకరాల్లో ఈ ఆలయాన్ని.. కేవలం 22 నెలల్లోనే ఎంతో అద్భుతంగా బిర్లా వంశస్థులు నిర్మించడం విశేషం. 1500 శిల్పా కళాకారులు ఎంతో భక్తిశ్రద్ధలతో రాధాకృష్ణ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం మొత్తం కూడా తెల్లటి మర్బుల్స్ తో సందర్శకులను ఆకట్టుకుంటోంది.
హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆలయంలోని శిల్పకళను తీర్చిద్దిద్దారు. రాధాకృష్ణ టెంపుల్ ను కుమార్ మంగళం బిర్లా తమ గ్రాండ్ పేరంట్స్ కు అంకితం ఇస్తూ నిర్మించారు. శ్రీ బీకే బిర్లా.. శ్రీమతి సర్లా బిర్లా విగ్రహాలు సైతం ఈ ఆలయం ప్రాంగణంలో నిర్మించడం విశేషం. ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో చూడొచ్చు. ఈ ఆలయం కేవలం భగవాన్ కృష్ణ భక్తులనే కాకుండా యావత్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకోవడం ఖాయమని ఈ ఆలయానికి వెళ్లొచ్చిన భక్తులు చెబుతున్నారు.