
Bakrid 2023 : నేడు (జూన్ 29న) హిందువులు ముక్కోటి ఏకాదశిని ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి.. బక్రీద్ పర్వదినాలు ఒకే రోజు రావడంతో దేశంలోని ప్రధాన ఆలయాలు.. మసీదులన్నీ సందర్శకులతో సందడిగా మారాయి.
హిందు ముస్లింలు ఒకరికొకరు ముక్కోటి ఏకాదశి.. బక్రీద్ శుభాకంక్షలు తెలియజేసుకుంటూ మతసామరస్యాన్ని చాటుకుంటోంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారత్ లో ఇలాంటి మాములే అయినా విదేశీయులు మాత్రం ఇటువంటి ఘటనలు చూసి ముగ్దులవుతున్నారు.
ఇదిలా ఉంటే నెట్టింట్లో ఓ పిక్ వైరల్ గా మారింది. ఓ పర్వతంపైకి ఎక్కిన రెండు మేకలు అక్కడి నుంచి కిందికి చూస్తూ ఉంటాయి. బక్రీద్.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నాన్ వెజ్ ప్రియులు పండుగ చేసుకోనున్నారు. బక్రీద్ సందర్భంగా మటన్.. చికెన్ కు విపరీతమైన గిరాకీ ఉండనుంది. దీంతో నేడు మేకలు.. గొర్రెలు.. కోళ్లు లక్షలాదిగా కబేళాలకు తరలుతుంటాయి.
ఈక్రమంలోనే రెండు మేకలు ఓ ఎత్తైన పర్వతం పైకి ఎక్కాయి. బక్రీద్ తర్వాతనే కిందికి వస్తామన్నట్లుగా అక్కడే ఉండిపోయాయి. అయితే బక్రీద్ తర్వాత అయినా వాటి ప్రాణాలకు గ్యారెంటీ ఉంటుందా? అంటే మాత్రం చెప్పలేని పరిస్థితి. జంతు ప్రేమికులు మాత్రం జీవహింస మహా పాపం అంటూ ఎప్పటిలాగే గొగ్గోలు పెడుతున్నారు. ఏదిఏమైనా నేడు ముక్కోటి ఏకాదశి.. బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.






