37.4 C
India
Friday, April 19, 2024
More

    Mananadu 2023 : పసుపువర్ణంలో గోదావరి తీరం.. ఎందుకంటే..

    Date:

    Mananadu 2023
    Mananadu 2023

    Mananadu 2023 : ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా టీడీపీ ఈసారి మహానాడును పెద్ద ఎత్తున నిర్వహణఖు ప్రణాళిక రూపొందించింది. మహానాడు కోసం 55 ఎకరాల్లో వేదికను ఏర్పాటు చేశారు. గోదావరి తీరాన రాజమండ్రి వేదికగా మహానాడును టీడీపీ అట్టహాసంగా నిర్వహించనుంది. రెండు రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నాయి. సభా ప్రాంగణం రాజమండ్రి శివారులోని వేమగిరి అయినా తూర్పుగోదావరి మొత్తం పసుపుమయమైంది. ఎన్టీఆర్‌ శత జయంతి కావడంతో ఈసారి మహానాడును కనీవినీ ఎరుగుని రీతిలో నిర్వహించాలని ప్రణాళికను రూపొందించింది. 55 ఎకరాల్లో సభా వేదికతో పాటు 15 వేల మంది ప్రతినిధులు కూర్చోవడానికి వీలుంటుంది. వేదికపై మూడు వందల మందికిపైగా కూర్చోవచ్చు.

    తొలి రోజు
    తొలి రోజు ప్రతినిధుల సభ ఉంటుంది. వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూల మాల వేసి నివాళి అర్పిస్తారు. ప్రతినిధుల సభ రిజిస్టర్‌లో సంతకం చేస్తారు. అనంతరం మిగతా నాయకులు ఆయన్ని అనుసరిస్తారు. తొలి రోజు ప్రతినిధుల సభ జరుగుతుంది. రెండో రోజు బహిరంగ సభ ఉంటుంది. మొదటి రోజు జరిగే ప్రతినిధి సభకు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో పార్టీ  నాయకులు హాజరుకానున్నారు. యాభై వేల మంది కార్యకర్తలు కూడా వస్తారని పార్టీ అంచనా వేస్తోంది.
    ఏడాది కాలంలో మరణించిన పార్టీ నేతలకు సంతాప తీర్మానం, పార్టీ జమా ఖర్చుల నివేదిక, ప్రధాన కార్యదర్శి నివేదికను ప్రతినిధుల ముందు పెడతారు. తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు ఉపన్యాసం ఉంటుంది.
    రెండో రోజు ఇలా
    రెండో రోజు నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు లక్షల్లో కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారని టీడీపీ లీడర్లు చెబుతున్నారు. వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో ఆ దిశగానే టీడీపీ ఏర్పాట్లు చేస్తున్నది. గతేడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు భారీగా పార్టీ శ్రేణులు రావడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇప్పుడు కూడా దానినే అనుసరిస్తున్నారు.

     21 తీర్మానాలు
    ఈసారి 21 తీర్మానాలను మహానాడులో చర్చించనున్నారు. ఇందులో 14 అంశాలు ఏపీవి కాగా, మిగతా తెలంగాణకు సంబంధించినవి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి సంక్షోభం, అవినీతి, పథకాల పేరిట చేస్తున్న ఆర్భాటం వంటి అంశాలను ప్రస్తావించే  అవకాశం ఉన్నది. టీడీపీ ప్రవేశ పెట్టిన పథకాలు, చేసిన అభివృద్ధిపై ప్రజలకు వివరించనున్నారు. పొత్తులు, ఇతర రాజకీయ అంశాలపై కూడా తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.
    కార్యకర్తలను అడ్డకునేందుకు వైసీపీ కుట్ర ?
    మహానాడుకు రాష్ర్ట వ్యాప్తంగా తరలివస్తున్న శ్రేణులను అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తున్నదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సులను రానివ్వకుండా అడ్డుపడుతున్నారని మండిపడుతున్నారు.

    మహానాడుకు గోదావరి రుచులు
    మహానాడుకు తరలి వచ్చే అభిమానులు, పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేక భోజనానలు ఏర్పాటు చేస్తున్నారు. తొలి రోజు దాదాపు 50 వేల మంది అవకాశం ఉంది. రెడీ అవుతున్నాయి. గోదావరి వంటకాలు రెండు రోజుల పాటు అతిథులను మైమరిపింపజేయనున్నాయి.

    12 వేల మందితో బందోబస్తు
    మహానాడుకు 12 వేల మందితో బందోబస్తు  నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు.  ట్రాఫిక్ సమస్యలు లేకుండా సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ప్లాన్ చేసినట్టు చెప్పుకొచ్చారు.

    Share post:

    More like this
    Related

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Ancient Jar : దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేస్తే ధగధగ మెరుస్తూ.. వైరల్ వీడియో

    Ancient Jar : ప్రపంచంలోని పలు దేశాల్లో పురాతన ఆనవాళ్లు ఇంకా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Monkey pox in Mahanadu : మహానాడులో మంకీ పాక్స్.. పుకారా? నిజమేనా..? ఏం జరుగుతోంది!

    Monkey pox in Mahanadu : టీడీపీ నిర్వహించుకునే అతిపెద్ద పండుగ...