
Gold Rates : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన సుంకాలు మరియు స్టాక్ మార్కెట్ పతనం కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణంగా స్టాక్ మార్కెట్ కుప్పకూలితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గత కొన్ని రోజులుగా దేశీయంగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం కూడా బంగారం ధర బాగా తగ్గింది. గుడ్ రిటర్న్స్ నివేదిక ప్రకారం, భారతదేశంలో గత ఏడు రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.3,450 మేర తగ్గింది. ఈ గణనీయమైన ధరల తగ్గుదల కారణంగా బంగారం కొనడానికి ఇది ఒక మంచి అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం తులం బంగారం (10 గ్రాములు) ధర సుమారు రూ.82,900 వద్ద ఉంది. రానున్న రెండు నుంచి మూడేళ్లలో బంగారం ధర మరింత దిగివచ్చి రూ. 50 వేలకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, దీర్ఘకాలిక పెట్టుబడి దృష్ట్యా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశంగా పరిగణించవచ్చు.