Magha Masam : మాఘమాసం మొదలైంది. శుభకార్యాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి శుభకార్యాలకు ముహూర్తాలు ఆరంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు అన్ని మంచి శకునములే. మంచి రోజుల్లోనే పుణ్య కార్యాలు నిర్వహించడం మన సంప్రదాయం. ఇక ఊరువాడ పెళ్లిళ్ల హోరు అందుకుంటోంది. ఎటు చూసినా పెళ్లి మండపాలు ముస్తాబవుతున్నాయి. పెళ్లి భాజాల చప్పుడు వినిపిస్తోంది.
ఈనెల 13,14,17,18,24,28,29, మార్చిలో 2, 3,15,17,20,22,24,25,27,28,30, ఏప్రిల్ 3, 4,9,18,19,20,21,22,24 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో పెళ్లిళ్లు జరగనున్నాయని పండితులు చెబుతున్నారు. శుభ ఘడియలు ఉండటంతో ఇక పెళ్లిళ్లు, ఇళ్లు నిర్మాణం చేసుకునే వారు ముహూర్తాలు చూసుకుని పనులు మొదలు పెడుతుంటారు.
మళ్లీ ఏప్రిల్ 30 నుంచి జులై 10 వరకు మూఢం ఉంటుందని సూచిస్తున్నారు. మే, జూన్ నెలల్లో మంచి రోజులు లేకపోవడంతో అప్పుడు ముహూర్తాల ఊసు ఉండదు. ఏదైనా మొదలు పెట్టాలంటే ఈ రెండు నెలల్లోనే ముఖ్యమైన పనులు చేసుకోవాలని పేర్కొంటున్నారు. పుణ్య తిథుల్లోనే మంచి పనులు చేసుకోవడం మనకు అలవాటు.
ఇప్పుడు శుభ ముహూర్తాలు ఉండటంతో ఆలస్యం చేయకుండా పనులు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. మంచి రోజులు ఎంచుకుని అనుకూల సమయం చూసుకుంటున్నారు. శుభ కార్యాల నిర్వహణకు మొగ్గు చూపుతున్నారు. పెళ్లిళ్లు అయితే రెండు నెలల్లోనే పూర్తి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పెళ్లి మండపాలు బిజీగా మారనున్నాయి.