23 C
India
Tuesday, October 6, 2026
More

    Good news for employees : ఏపీలో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

    Date:

    Good news for employees
    Good news for employees (File Photo)

    Good news for employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎట్టకేలకు అడుగులు వేసింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించి కసరత్తు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నది. ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేయాలని సీఎంవో ఆదేశించినట్లు తెలిసింది. అయితే ఈ ఏడాది జూలై నుంచి కొత్త పీఆర్సీ ఉద్యోగులకు అమల్లోకి రావాల్సి ఉంది. పీఆర్సీపై  అధ్యయనం..నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుంది.

    వేతన సవరణ సంఘం ద్వారా ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఖరారు చేసేందుకు చర్యలను ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. కొత్త పీఆర్సీ పై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చాయి. జూలై నుంచి కొత్త పేస్కేల్ అమలు చేయాల్సి ఉంది. పీఆర్సీ వేతనాలతో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాల పైన ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ఈ నేపథ్యంలో సంబంధింత ఫైల్ ను సర్క్యులేట్ చేయాలని ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శికి సీఎంవో నుంచి సర్క్యులర్ జారీ చేశారు. పీఆర్సీ కమిటీ చైర్మన్ గా రిటైర్డ్ సీఎస్ సమీర్ శర్మతో పాటుగా మరి కొంత మంది రిటైర్డ్ ఉద్యోగుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

    ఫోకస్ వీటిపైనే..

    పెండింగ్ అంశాలపై ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చర్చలు జరిపారు. వచ్చే కేబినెట్ లో సమస్యల పైన చర్చిస్తామని.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి.. నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటు ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ అన్ని వర్గాలకు ప్రయోజనకరం చేకూర్చే  నిర్ణయాల పైన దృష్టి సారించారు. ఇక, పీఆర్సీ సమయం కూడా దగ్గర పడడంతో ఆ దిశగా కసరత్తు చేపట్టిందిజ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీంకు సంబంధించి చర్చలను తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఉద్యోగులకు నష్టం లేకుండా సీపీసీ రద్దు హామీ అమలు దిశగా మధ్యే మార్గంగా అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Politics : కులం పేరుతో ఏపీలో ఈ అరాచకాలు ఎన్నాళ్లు?

    AP Politics : కుల రహిత సమాజం కోసం గత పాలకులు...

    Jagan Stone Attack : సీఎం జగన్ పై రాయి దాడి కేసు.. నిందితుడికి బెయిల్

    Jagan Stone Attack : ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం జగన్...

    IPL and Jagan : ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ ఓటమికి జగన్ సీఎం పదవికి లింక్ ఉందా?

    IPL and Jagan : గత ఐపీఎల్ టోర్నీలకు మించిన ఎంటర్...

    YCP : వైసీపీ దేనికి సిద్ధం 

    YCP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. జూన్ నాలుగున...