Jai Bharat National Party : బ్యాటరీ టార్చ్ వెలిగిద్దాం. చీకటిని పారదోలుదాం…అని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ పిలుపుని చ్చారు. జైభారత్ నేషనల్ పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ కామన్ సింబల్ ని ప్రకటించింది. ఈ మేరకు ఎన్ని కల కమిషన్ నుంచి ఉత్తర్వులు తమకు అందా యని లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్లమెంట్ నియోజక వ ర్గాలకు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కామన్ సింబల్ గా బ్యాటరీ టార్చ్ ని కేంద్ర ఎన్ని కల సంఘం కేటాయించినట్లు ఆయన వెల్లడిం చారు.
పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలన్నింటికీ ఒకే ఒక కామ న్ సింబల్ బ్యాటరీ టార్చ్ రావడం మన పార్టీకి మంచి ఊపు అని ఆయన పేర్కొన్నారు. అంధ కారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి వెలుగు దివ్వెగా జై భారత్ నేషనల్ పార్టీ బ్యాటరీ టార్చ్ వెలిగిస్తుందని ఆయన తెలిపారు.