
Shani Yoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని కుంభ రాశిలో ప్రవేశించాడు. దీంతో జూన్ 17న తన రాశిలోనే వెనకకు వస్తున్నాడు. దీన్ని శని తిరోగమన కదలిక కొన్ని రాశులకు లక్ కలిగించనుంది. కొన్ని రాశులకు మాత్రమే ఇబ్బందులు వస్తాయి. మూడు రాశుల వారికి మాత్రం శని శుభాలు కలిగించనున్నాడు. వాటికి సంపదలు ఇవ్వనున్నాడు. దీంతో వారి జాతకాలే మారనున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. విదేశాలకు వెళ్లే యోగం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తండ్రి ఆస్తులు పొందే వీలుంటుంది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. చాలా కాలంగా రాదనుకుంటున్న డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగంలో బదిలీలకు ఆస్కారం ఉంటుంది. ఈ రాశి వారికి అన్నింటా శుభాలు రానున్నాయి.
సింహ రాశి వారికి కూడా అనుకూల ఫలితాలే వస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల మార్పులు వస్తాయి. ఏవైనా పెండింగ్ పనులు ఉంటే పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో సరదాగా గడుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అప్పులు ఇవ్వడం లాంటివి చేయకండి. ఒకవేళ ఇస్తే తిరిగి రావు. జాగ్రత్తగా ఉండాలి. మంచి ఫలితాలు వస్తున్నా మనం అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతి.
కుంభ రాశిలో శని తిరోగమన దశలో ఉన్నందున వీరి కలలు నెరవేరతాయి. ఉద్యోగంలో పదోన్నతులు దక్కుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. తోబుట్టువులతో మంచి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఆగిపోయిన పనుల్లో చలనం వస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శ్రమించి విజయాలు దక్కించుకుంటారు.
ఈ మూడు రాశుల వారికి అనుకూలంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో వీరికి మంచి శుభాలు కలగనున్నాయి. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. శని తిరోగమన దిశను బట్టి జాతకంలో మంచి జరుగుతుంది. శని ఈ మూడు రాశుల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నాడు. దీనివల్ల వీరి జాతకంలో శుభ శకునాలు ఎదురు కానున్నాయి.