Train Passengers : ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు రైల్వే అధికారులు ఓ శుభవార్తను అందించారు. హైదరాబాద్ లింగపల్లి వెళ్లే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ట్రైన్‌కు అధునాతనమైన ఎల్‌హెచ్‌బీ బోగీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రైన్ ఆదివారం నుంచే ప్రారంభమైంది. రైలు ప్రయాణికుల కోసం మరిన్ని సౌకర్యాలను అందించేందుకు అధునా తనమైన లింకె హాఫ్‌మన్ బచ్చ్ బోగీలను కాకినాడ-లింగంపల్లి-కాకినాడల మధ్య రాక పోకలు సాగించే గౌతమి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.
భారతదేశంంలో ఎక్కువశాతమంది ప్రజలు రైలుప్రయాణాలే చేస్తుంటారు. ఎందుకంటే సూదర ప్రాంతాలను అతి తక్కువ ఖర్చుతో సౌకర్యవం తంగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఉంటుంది రైలు ప్రయాణం. అందుకే ఎక్కువ శాతం మంది ప్రయాణికులు ఈ మార్గాన్నే ఎంచుకుంటుంటారు. రైలు ప్రయాణాలు జీవితంలో మరిచిపోలేని అను భూతులను కూడా ఇస్తాయి. ఇప్పడు ఈ రైలు ప్రయాణాల్లో ఎన్నో ఆధునాతమైన టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి.
ఏపీలోని రైలుప్రయాణికుల కోసం రైల్వే అధికా రులు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. గౌతమి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు ఆధునాతమైన ఎల్‌హెచ్‌బీ బోగీలను ఏర్పాటు చేశారు. కాకినాడ, సామర్లకోట రైల్వేస్టే షన్లకు ఈ మేరకు రైల్వే పీఆర్వో కార్యాలయం నుంచి ఆదేశాలు కూడా రావడం జరిగింది. గత సంవత్సరం జూలైలో అధునాతన బోగీలు కలిగి ఉండే కొన్ని ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌ను ప్రారంభించారు.
ఈ బోగీలు మంచి ఫలితాలను ఇవ్వడంతో మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా ఎల్‌హెచ్‌బీ బోగీలను మార్పులు చేస్తున్నారు. అందులో కాకినాడ-లింగంపల్లి- కాకినాడల మధ్య రాకపోక లు సాగిస్తున్న గౌతమి ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌కు కూడా ఎల్‌హెచ్‌బీ బోగీలను అనుసంధానం చేయడం జరిగింది.
గౌతమీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు 22 ఎల్‌హెచ్‌బీ బోగీలు..
ఈ ఆధునాతమైన బోగీలతో కూడిన గౌతమీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆదివారం నుంచే ప్రారంభ మయ్యా యి. ఇక, ఈ బోగీలను జర్మనీ కొలాబ్రేషన్‌తో కపూ ర్తలాలో తయారుచేయబోతున్నట్లు సమాచారం. ఈ అధునాతనమైన ఎల్‌హెచ్‌బీ బోగీలతో ప్రయా ణం ఎటువంటి కుదుపులు, శబ్దాలు లేకుండా ఎంతో సాఫీగా సాగిపోతుందని రైల్వే అధికారులు అంటున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు మొత్తం 24 బోగీలు ఉంటే 22 బోగీలు ఎల్‌హెచ్‌బీ బోగీలే. డబుల్ సస్పెన్షన్, డిస్క్, బ్రేకింగ్ విధానంతో ఈ బోగీలలో ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే అధికారులు వివరించారు