
GOOD NEWS Reduce Toll Tax : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఛార్జీలు తగ్గాయి. ఈ అర్ధరాత్రి (ఏప్రిల్ 1) నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ఈ హైవేపై ఉన్న మూడు టోల్ ప్లాజాల్లో (పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు) ఛార్జీలు తగ్గాయి. పంతంగి వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు రూ.15, రెండువైపులా కలిపి రూ.30 వరకు తగ్గింది. బస్సులు, ట్రక్కులకు ఒకవైపు రూ.50, రెండువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు ఒకవైపు రూ.5, రెండువైపులా కలిపి రూ.10 తగ్గించారు.