
Gorantla Butchaiah Chowdhury : అధికారం ఉందని అహంకారంతో విర్రవీగి ప్రతిపక్ష నేతలను కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేసిన వారిని వదల వద్దని.. పార్టీ మారగానే పాత పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ లో చేరుతున్నారని.. అలాంటి వారిని టీడీపీలో చేర్చుకోవద్దంటూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకంగా అధిష్టానానికే హెచ్చరికలు జారీ చేయడం సంచలనమైంది.
ఏదో ఒక కారణంతో వైసీపీ వాళ్లు టీడీపీలో చేరుతున్నారని.. పదవులు పొందుతున్నారని.. దీనివల్ల టీడీపీ కోసం ప్రతిపక్షంలో ఉండగా పనిచేసిన కార్యకర్తలు, నేతలు అన్యాయం అయిపోతున్నారంటూ బుచ్చ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుచ్చయ్య మాటలు టీడీపీలో కలకలం రేపాయి. కానీ ఆయన టీడీపీ కార్యకర్తల కోసం మాట్లాడిన ఈ మాటలను క్యాడర్ వందశాతం సమర్ధిస్తోంది. గత ప్రభుత్వంలో బిల్లులు రాని వాళ్ళాంతా ఇప్పుడు కూటమిలో చేరుతున్నారు,మళ్ళీ 2029కి వాళ్ళు వైసీపీకి పోతారు. కాబట్టి అలాంటి వారిని చేర్చుకోవద్దని టీడీపీ శ్రేణులు అధిష్టానాన్ని కోరుతున్నాయి.






