Srileela Gorgeous Looks :
టాలీవుడ్ లో ప్రజెంట్ మోస్ట్ ఫేమస్ పీపుల్ లలో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల ఒకరు. ఎంతో మంది ముద్దుగుమ్మలను వెనక్కి నెట్టి మరీ శ్రీలీల రేసులో టాప్ లో ఉంది.. ఈ భామ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ గర్ల్ గా మారిపోయింది. ఈమె నటన, అందం ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయడంతో వరుస అవకాశాలు ఇచ్చి మరీ ఇక్కడే ఉండేలా చేస్తున్నారు..
ఇక ధమాకా సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మరింత గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా హిట్ తర్వాత శ్రీలీల మరిన్ని అవకాశాలు అందుకుంటుంది.. ఇదిలా ఉండగా ఈమె సోషల్ మీడియాలో తాజాగా క్యూట్ పిక్స్ షేర్ చేసింది. దీంతో ఈ అమ్మడు కొత్త లుక్ మరింత ఆకట్టు కుంటుంది..
క్యాజువల్ వేర్ లో కనిపించిన కూడా ఈమె అందం అందరిని మెస్మరైజ్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగి పోవడంతో తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ సినిమాల్లో కేసుల అవకాశాలు దక్కించు కుంటుంది.. 21 ఏళ్ల ఈ భామ ఇప్పుడు బిజీగా లేను అని చెప్పేందుకు కూడా సమయం లేకుండా కష్టపడుతుంది.
రోజుకు 24 గంటల బదులుగా 48 గంటలు ఉంటే బాగుండు అనేలా ఈ భామ కెరీర్ మంచి ఊపు మీద సాగుతుంది.. కుర్ర హీరోల సరసన మాత్రమే కాదు స్టార్ హీరోల సరసన కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది. తెలుగులోనే అరడజనుకు పైగానే సినిమాలు సెట్స్ మీద ఉండగా మరిన్ని సినిమాలు లైనప్ లో ఉన్నాయి. చూడాలి ఈమె కెరీర్ ముందు ముందు ఎలా సాగుతుందో..